Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!

Ration Cards : రేషన్ కార్డులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులను మంజూరు చేయడానికి సిద్ధమైంది. ఇటీవల కులగణన ఆధారంగా రేషన్ కార్డుల జాబితాను సిద్ధం చేశారు. ఆ జాబితాలో పేర్లు లేవని చాలామంది ఆందోళన చేసిన విషయం తెలిసిందే. దాంతో జనవరి మాసంలో నాలుగు రోజులపాటు నిర్వహించిన గ్రామసభలలో మరోసారి దరఖాస్తులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి కీలకమైన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. రేషన్ కార్డుల జారీ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు అందజేస్తామని తెలియజేశారు.
కాగా కొత్త రేషన్ కార్డుల కోసం మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తులు చేసుకునే అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లబ్ధిదారుల నుంచి రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించాలని మీసేవ కమిషనర్ ను పౌరసరఫరాల శాఖ సూచించింది.
కొత్త రేషన్ కార్డుల కోసం గత పది ఏళ్లుగా ఎదురు చూస్తున్న విషయం తెలిసిందే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవడంతో పాటు దరఖాస్తులలో పేర్లు మార్పు చేసుకోవడానికి ఎంతో మంది ఎదురుచూస్తున్నారు. రేషన్ కార్డులలో పేరు మార్పులు, చిరునామా మార్పులు ఇతర మార్పులు అవసరం ఉంటే మీ సేవలోని ఆన్‌లైన్ ద్వారా అప్డేట్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది.
MOST READ :
-
District collector : మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్.. సిబ్బందికి ఆదేశాలు..!
-
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో పడలేదా.. అయితే ఇలా చేయండి..!
-
News : పార్టీ మారిన ఎమ్మెల్యేలు ట్విస్ట్.. ఒకే మాట.. ఒకే నిర్ణయం..!
-
Seeds : నకిలీ విత్తనాలతో నిండా మునిగిన రైతులు.. వరి పొలాలు సందర్శించిన కోదండరెడ్డి..!
-
Miryalaguda : నల్గొండ జిల్లా మిర్యాలగూడలో విషాదం.. వేదింపులకు యువతి ఆత్మహత్య..!









