Chinthapally : పీకే మల్లేపల్లి దర్గా ఉర్సు.. భారీ భద్రత ఏర్పాట్లు..!
Chinthapally : పీకే మల్లేపల్లి దర్గా ఉర్సు.. భారీ భద్రత ఏర్పాట్లు..!
చింతపల్లి, మన సాక్షి :
నల్గొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని పీకే మల్లేపల్లి గ్రామంలో ఈనెల 21 నుండి 23 వరకు హజరత్ అబ్బాస్ షరీఫ్ దర్గా ఉరుసు ఉత్సవాలు జరగనున్న సందర్భంగా దర్గా కమిటీ నిర్వాహకులు దర్గా వద్ద సకల సౌకర్యాలు సమకూరుస్తున్నారు. మంగళవారం నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్నవీన్ కుమార్, చింతపల్లి సబ్ ఇన్స్పెక్టర్ బీణమోని యాదయ్య. మర్రిగూడ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి లు దర్గా పరిసర ప్రాంతాలను పరిశీలించారు.
మూడు రోజులు జరిగే ఈ ఉరుసు ఉత్సవాల కోసం జిల్లా ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, వివిధ పార్టీల రాజకీయ నేతలు హాజరుకానున్న దృశ్య దర్గా సమీపంలో ఎలాంటి ఆవా ఆంజనేయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రముఖుల భద్రత ఏర్పాట్లు కోసం దర్గా కమిటీ నిర్వాహకు లతో వివరాలు సేకరించారు.
అదే రోజు దర్గాకు సమీపంలోనున్న శ్రీ మక్కా మహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం కూడా జరగనున్నట్లు దర్గా కమిటీ నిర్వాహకులు పోలీసులకు పలు ఉత్సవ విషయాల పట్ల సమాచారం అందించారు. దర్గా వద్ద అన్నదాన కార్యక్రమాన్ని అందిస్తున్న సందర్భంగా త్రాగునీటి విషయంపై కూడ వివరాలను అడిగి తెలుసుకున్నారు.
తగిన బందోబస్తు ఏర్పాటు చేసి ఉత్సవాలు సవ్యంగా జరిగేటట్లు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీరి వెంట పోలీసు సిబ్బంది, దర్గా కమిటీ ముత్తవల్లి, మహమ్మద్ చాంద్ పాషా, కమిటీ సభ్యులు యూసఫ్ పాషా, తదితరులు ఉన్నారు.
Most Read News :
-
UPI : మీరు ఫోన్ పే, గూగుల్ పే వాడుతున్నారా.. జాగ్రత్త, ఇలా చేశారో క్షణాల్లో మీ ఎకౌంట్ ఖాళీ..!
-
Breaking News : టాప్ 5 బ్రేకింగ్ న్యూస్..!
-
Miryalaguda : కెసిఆర్ ను మించిన రేవంత్ రెడ్డి.. ఈటెల రాజేందర్ సంచలన ఆరోపణ..!
-
Ration Cards : కొత్త రేషన్ కార్డుల పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు.. లేటెస్ట్ అప్డేట్..!









