Miryalaguda : విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..!
Miryalaguda : విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ని ఎస్ వి మోడల్ హై స్కూల్ లో ఘనంగా పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మిర్యాలగూడ మండల విద్యాధికారి లావూరి బాలు పాల్గొని విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి మార్కులు సాధించాలని కోరారు. విద్యార్థులు క్రమశిక్షణతో ఉండి ఉన్నత విద్య ను అభ్యసించాలని, మంచి మార్గంలో నడవాలని, అత్యున్నత స్థాయిలో స్థిరపడాలని కోరారు.
పాఠశాల కరస్పాండెంట్ ఓరుగంటి శ్యాంసుందర్ మాట్లాడుతూ చదువే అన్నిటికంటే విలువైనదని, అందరి భవిష్యత్తు బాగుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధులు త్రిపురారం మండల విద్యాధికారి రవి నాయక్, గోపి, భాస్కర్ రెడ్డి, కుందూరు సైదిరెడ్డి, వీరవెల్లి శ్రీనివాస్, సుధాకర్ శ్రీలక్ష్మి, రమేష్, సాంబయ్య లతోపాటు ఎస్ వి మోడల్ హై స్కూల్ డైరెక్టర్ విశాలాక్ష్మి, ఇన్చార్జి నాగలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.


MOST READ :
-
CM Revanth Reddy : ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు.. నేతల్లో టెన్షన్..!
-
Cm Revanth Reddy : 12 ఏళ్లు అద్దె ఇంట్లో గడిపిన రేవంత్ రెడ్డి.. అ ఇంటికి వెళ్లి భావోద్వేగం..!
-
TG News : రాష్ట్రంలో కొత్త పథకానికి శ్రీకారం.. రూ.2 లక్షల రుణం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..!
-
Passport Rules : పాస్ పోర్ట్ నిబంధనలో మార్పులు.. ఆ సర్టిఫికెట్ తప్పనిసరి..!











