Breaking Newsక్రైంజిల్లా వార్తలురంగారెడ్డిహైదరాబాద్
Fire Accident : బైక్ రిపేర్ షాప్ లో చెలరేగిన మంటలు..!
Fire Accident : బైక్ రిపేర్ షాప్ లో చెలరేగిన మంటలు..!
రాజేంద్రనగర్, మనసాక్షి :
రంగారెడ్డి జిల్లా మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గవర్నమెంట్ స్కూల్ సమీపంలో బైక్ రిపేర్ షాప్ లో ఒక్క సారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బైకులు పూర్తిగా కాలిపోయాయి. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అగ్రిమాపక సిబ్బంది మంటలను పూర్తిగా అదుపులో తీసుకొచ్చారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగిందని అక్కడున్న స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసిన మైలర్ దేవ్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.









