క్రైంBreaking Newsజిల్లా వార్తలునల్గొండ

BREAKING : రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం..!

BREAKING : రైలు కిందపడి వ్యక్తి బలవన్మరణం..!

కనగల్, మన సాక్షి :

రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నల్లగొండ సమీపంలోని దుప్పలపల్లి పరిధిలోగల రైలు పట్టాలపై మంగళవారం వెలుగు చూసింది. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం… కనగల్ మండలం చిన్నమాదారం గ్రామానికి చెందిన వట్టికోటి ఎల్లేష్ (37) రైలు కిందపడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎల్లేష్ గత కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాడు.

సోమవారం మిర్యాలగూడలో నిర్వహించిన బంధువుల ఫంక్షన్ కు హాజరై రాత్రి 9 గంటల ప్రాంతంలో బైక్ పై నల్లగొండకు బయలుదేరాడు. మార్గమధ్యలోని తిప్పర్తి మండలం అనిశెట్టి దుప్పలపల్లి శివారులోగల రైలు పట్టాలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

మంగళవారం రైలు పట్టాలపై చిత్రమైన మృతదేహాన్ని గమనించిన రైల్వే పోలీసులు అక్కడికి చేరుకొని ఆధారాలు సేకరించగా మృతుని ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. రైలు ఢీకొట్టడంతో ఎల్లేష్ మృతదేహం చిద్రమై మాంసపు ముద్దలుగా రైలు పట్టాలపై పడ్డాయి. కాగా ఎల్లేష్ కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.

కొంతకాలంగా ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న ఎల్లేష్ ఇంతటి అఘాయిత్యానికి పాల్పడతాడని అనుకోలేదని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఎల్లేష్ నల్లగొండ పట్టణంలోని ఓ రెస్టారెంట్ లో కొంతకాలంగా పనిచేస్తూ నల్లగొండలోనే అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ మార్చురీకి తరలించారు.

MOST READ :

  1. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక నిర్ణయం.. గ్రామానికో పోలీస్ అధికారి, రేపటి నుంచే అమలు..!

  2. BREAKING : అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసులు మృతి..!

  3. Kanagal : ఇసుక ట్రాక్టర్ కిందపడి డ్రైవర్ దుర్మరణం..!

  4. Huzurnagar : నలుగురు నకిలీ ఎస్సైలు.. వారి టార్గెట్ బంగారం షాపులే.. ఏం చేశారో తెలిస్తే షాక్..!

  5. Nalgonda : నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు..!

మరిన్ని వార్తలు