TOP STORIESBreaking Newstravelహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..!

Hyderabad : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులు..!

హైదరాబాద్, మన సాక్షి :

నగర రవాణాలో అగ్రగామిగా, ఎల్ &టి మెట్రో రైల్ (హైదరాబాద్) లిమిటెడ్ (ఎల్&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ ) ఆవిష్కరణ, సామర్థ్యం మరియు అవకాశాలు అందించటం ద్వారా ప్రయాణికుల అనుభవాన్ని పునర్నిర్వచించటానికి కట్టుబడి ఉంది.
హైదరాబాద్ మెట్రో ఆర్ట్ ఫెస్ట్, మెట్రో ఫెస్ట్ – ఉగాది వేడుకలు మరియు ఎల్ అండ్ టి ప్రీమియా మాల్‌ – ఇరమ్ మంజిల్ వద్ద మెట్రో మెడ్లీ ముగుస్తోన్న వేళ, ఎల్&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ డిజిటల్ ఇంటిగ్రేషన్‌లో తదుపరి అడుగును సరికొత్త టి-సవారీ మొబైల్ అప్లికేషన్ విడుదల మరియు పునరుద్ధరింపబడిన హైదరాబాద్ మెట్రో ప్రయాణీకుల వెబ్ సైట్ తీసుకురావటం ద్వారా వేసింది.

ఈ పురోగతులతో పాటు, మెట్రో రైలు సమయ పొడిగింపు, విద్యార్థుల ప్రయోజనాలతో సహా కీలక అంశాల మెరుగుదలలు-మెట్రో ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చాలనే మెట్రో లక్ష్యం నొక్కిచెబుతున్నాయి.

పొడిగించిన రైలు సమయాలు

పెరుగుతున్న ప్రయాణీకుల డిమాండ్‌కు అనుగుణంగా, మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించటం కోసం తమ టెర్మినల్ స్టేషన్‌ల నుండి చివరి రైలు బయలుదేరే సమయం 1 ఏప్రిల్ 2025 నుండి ప్రస్తుతమున్న 11:00 PM నుండి 11:45 PM (సోమవారం నుండి శుక్రవారం వరకు) కు మార్చబడింది. మొదటి రైలు ఇప్పుడు టెర్మినల్ స్టేషన్‌ల నుండి ఉదయం 7:00కి ఆదివారాలలో సేవలను ప్రారంభిస్తుంది.

అలాగే, హైదరాబాద్ మెట్రో ను విద్యార్థులు ఎక్కువ గా వినియోగించుకోవడం పరిగణలోకి తీసుకుని 20 ట్రిప్పులకు చెల్లించి 30 ట్రిప్పులను విద్యార్థులు పొందే-ఆఫర్ ను మరో సంవత్సరం పాటు పొడిగించింది. ఇది మార్చి 31, 2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 2024లో ప్రారంభమైన సూపర్ సేవర్ హాలిడే ఆఫర్ (SSO) మరియు ఆఫ్-పీక్ తగ్గింపు ఆఫర్ 31 మార్చి 2025న ముగుస్తుంది.

హెచ్‌ఎంఆర్‌ఎల్, ఎండి,శ్రీ ఎన్‌విఎస్ రెడ్డి మాట్లాడుతూ “హైదరాబాద్ మెట్రో రైలు, కేవలం మౌలిక సదుపాయాల ప్రాజెక్టు మాత్రమే కాదు-ఇది పట్టణ పరివర్తన , సమాజ అభివృద్ధికి ఉత్ప్రేరకం. మెట్రో ఫెస్ట్, మెట్రో మెడ్లీ మరియు ఆర్ట్ ఫెస్ట్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలను మా రవాణా వ్యవస్థలో చేర్చడం ద్వారా, ప్రజా రవాణా వ్యవస్థను పునర్వ్యవస్థీకరించడంలో మేము కీలక పాత్ర పోషిస్తున్నాము” అని అన్నారు.

ఎల్&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్, ఎండి & సీఈఓ , శ్రీ కెవిబి రెడ్డి మాట్లాడుతూ , ” ఎల్&టిఎమ్‌ఆర్‌హెచ్‌ఎల్ వద్ద, సౌకర్యవంతమైన పట్టణ ప్రయాణం అనేది భౌతిక మరియు డిజిటల్ ఏకీకరణల కలయిక అని మేము నమ్ముతున్నాము. టి -సవారి యాప్ మరియు మా పునరుద్ధరించిన ప్రయాణీకుల వెబ్‌సైట్‌ను ప్రారంభించడం ద్వారా హైదరాబాద్ మెట్రోను డిజిటల్‌గా సుసంపన్నమైన రవాణా వ్యవస్థగా మార్చడంలో ఒక ముఖ్యమైన అడుగు సూచిస్తుంది” అని అన్నారు.

మరింత సమాచారం కోసం , www.ltmetro.comని సందర్శించండి.

ALSO READ : 

మరిన్ని వార్తలు