Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో.. ప్రభుత్వం ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
Rythu Bharosa : రైతు భరోసా డబ్బులు ఖాతాలలో.. ప్రభుత్వం ప్రకటన.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు ప్రభుత్వం శుభవార్త తెలియజేసింది. రైతు భరోసా నిధులు రైతుల ఖాతాలలో జమ చేయనున్నట్లు ప్రకటించింది. మార్చి 31వ తేదీ లోగా 90 శాతం మంది రైతుల ఖాతాలలో రైతు భరోసా డబ్బులు జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
గత ప్రభుత్వం రైతుబంధు పథకం ద్వారా ఎకరానికి 10,000 రూపాయలను పెట్టుబడి సహాయంగా అందజేసిన విషయం తెలిసిందే. కాగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎకరానికి 12,000 రూపాయలను పెట్టుబడి సహాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే.
అందులో భాగంగా 2025 జనవరి 26వ తేదీన రైతు భరోసా పథకాన్ని ప్రారంభించారు. మార్చి 31వ తేదీ లోపు రైతులందరికీ రైతు భరోసా అందజేస్తామని ప్రకటించారు. మార్చి 31 నాటికి రాత్రి నాటికి 90 శాతం రైతుల ఖాతాలలో రైతు భరోసా ఒక విడత ఎకరానికి 6000 రూపాయలు జమ కానున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ ఉదయం చెక్ చేసుకుంటే నాటికి 90 శాతం రైతుల ఖాతాలలో డబ్బులు జమ కానున్నాయి.
ఐదు ఎకరాల లోపు ఉన్న రైతులందరికీ రైతు భరోసా డబ్బులు జమకానున్నాయి. 90 శాతం మంది సన్న, చిన్నకారు రైతులే ఉండటంతో వారందరి ఖాతాలలో మార్చి 31 రాత్రి వరకు జమ కానున్నాయి. మిగతా పది శాతం మంది రైతులకు వెంటనే నిధులు విడుదల చేసి జమ చేయనున్నారు.









