Bank Rules : మారిన బ్యాంకు రూల్స్.. నేటి నుంచే అమలు.. తెలుసుకోకుంటే నష్టమే..!
Bank Rules : మారిన బ్యాంకు రూల్స్.. నేటి నుంచే అమలు.. తెలుసుకోకుంటే నష్టమే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
ఒక్కొక్క వ్యక్తికి రెండు, మూడు బ్యాంకు ఖాతాలు ఉంటున్నాయి. అవి అన్ని వినియోగంలో లేకుండా కేవలం ఒకటి మాత్రమే వినియోగిస్తుంటారు. అలాంటప్పుడు వినియోగదారులకు భారీ నష్టం జరగనున్నది. బ్యాంకు ఖాతాల నియమ నిబంధనలు ఎప్పటికప్పుడు ఆర్బిఐ రూల్స్ ప్రకారం మారుతున్నాయి.
దేశవ్యాప్తంగా బ్యాంకు రూల్స్ ఏప్రిల్ 1 నుంచి మారుతున్నాయి. రెండు, మూడు ఖాతాలు ఉంటే వాటిలో మినిమం బ్యాలెన్స్, విత్ డ్రాకు సంబంధించిన నియమ నిబంధనలు మారాయి. వాటిని తప్పనిసరిగా వినియోగదారులు తెలుసుకోకుంటే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. SBI, పంజాబ్ నేషనల్ బ్యాంకు, కెనరా బ్యాంకు, మరికొన్ని బ్యాంకులు కనీస బ్యాలెన్స్ కు సంబంధించిన రూల్స్ మార్చాయి.
మీ బ్యాంకు ఖాతా పట్టణంలో ఉందా..? గ్రామీణ ప్రాంతంలో ఉందా..? అనే దానిపై కూడా ఆధారపడి ఉంటుంది. మినిమం బాలన్స్ కంటే తక్కువ బ్యాలెన్స్ కలిగి ఉన్నందున మీరు జరిమానాలు తప్పకుండా చెల్లించాల్సి ఉంటుంది.
దాంతోపాటు ఏటీఎం ను ఉపయోగిస్తే కేవలం ఏటీఎం కలిగిన బ్యాంకు అయితే నెలలో మూడు సార్లు మాత్రమే ఉచితంగా డబ్బులు తీసుకోవచ్చును. ఆ తర్వాత డ్రా చేసిన ప్రతి లావాదేవీకి ₹20 నుంచి 25 రూపాయల వరకు చార్జి చెల్లించాల్సి ఉంటుంది. సొంత బ్యాంకు నుంచి మూడు పర్యాయాల కంటే ఎక్కువ తీసుకున్నట్లయితే ఇపంపుడు 17 రూపాయల ఛార్జి చెల్లిస్తున్నాం పెరిగిన చార్జీల ప్రకారం నేటి నుంచి 19 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.
అదేవిధంగా బ్యాంకు స్టేట్మెంట్, బ్యాలెన్స్ చెక్ చేసుకున్న వారికి కూడా ప్రతి లావాదేవీ కి ఏడు రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాంకు నియమ నిబంధన ప్రకారం వినియోగదారులు వ్యవహరించుకుంటే జరిమానాలు తప్పవు.
MOST READ :
-
UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!
-
LPG : భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!
-
Ration Cards : రేషన్ కార్డు దరఖాస్తుదారులకు బిగ్ ట్విస్ట్.. ఆ తర్వాతే కార్డుల పంపిణీ.. లేటెస్ట్ అప్డేట్..!
-
TG News : ఓ ఇంటి నుంచి వింతైన వాసన.. చెక్ చేసి ఖంగుతిన్న అధికారులు..!
-
Toll Tax : టోల్ టాక్స్ తగ్గిందోచ్.. వాహనదారులకు భారీ ఊరట..!









