Breaking Newsక్రైంజిల్లా వార్తలునారాయణపేట జిల్లా

Narayanpet : జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

Narayanpet : జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

నారాయణపేట జిల్లాలో శాంతి భద్రతలను దృష్టిలో వుంచుకొని నెల రోజుల ( ఈనెల 30 వరకు) పాటు జిల్లా వ్యాప్తం గా 30,పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ. యోగేష్ గౌతమ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలీసు అధికారుల ముందస్తు అనుమతి లేకుండా జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిదులు, వివిధ సంఘాలు ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలిలు, పబ్లిక్ మీటింగ్ లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు.

అలాగే ప్రజల శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా మరియు ప్రజా ధనానికి, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కల్గించే చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టరాదని ఎస్పీ హెచ్చరించారు. కాబట్టి జిల్లా ప్రజలు, ప్రజా ప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు పోలీసు వారికి ఇట్టి విషయంలో సహకరించాలని ఎస్పీ తెలిపారు. ఎలాంటి అనుమతి లేకుండా ధర్నాలు సభలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తే సంబంధిత వ్యక్తులపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని ఎస్పీ హెచ్చరించారు.

MOST READ ;

  1. PDS : వెయ్యి మెట్రిక్ టన్నుల సన్న బియ్యం పంపిణీ.. డిఎస్ఓ రాజేశ్వరరావు వెల్లడి..!

  2. Nalgonda : పేదల ఆత్మగౌరవ పథకం.. సన్న బియ్యం పంపిణీ.. మంత్రి కోమటిరెడ్డి..!

  3. Traffic : మీ బండ్లకు, కార్లకు ఈ చలాన్లు చెల్లించడం లేదా.. అయితే భారీ షాక్.. కొత్త పెనాల్టీలు..!

  4. UPI : గూగుల్ పే, ఫోన్ పే వినియోగదారులకు బిగ్ అలర్ట్.. నేటి నుంచి ఆ నెంబర్లు పనిచేయవు..!

  5. LPG : భారీగా తగ్గిన LPG సిలిండర్ ధర.. నేటి నుంచే అమలు..!

మరిన్ని వార్తలు