Nalgonda : టాస్క్ ఫోర్స్ పోలీసుల విస్తృత దాడులు.. నకిలీ మద్యం గుట్టురట్టు..!
Nalgonda : టాస్క్ ఫోర్స్ పోలీసుల విస్తృత దాడులు.. నకిలీ మద్యం గుట్టురట్టు..!
నల్లగొండ, మన సాక్షి.
నల్గొండ జిల్లా చండూరు, కనగల్, నాంపల్లి: మండలాలలో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు జరిపి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు. టాస్క్ఫోర్స్, ఎస్ఓటీ పోలీసులు చండూరు మండల కేంద్రం లో గుట్టుచప్పుడు కాకుండా నడుస్తున్న నకిలీ మద్యం దందా గుట్టురట్టు చేశారు.
చండూరు మండల కేంద్రానికి చెందిన ఎర్రజెల్ల రమేష్, కనగల్ మండలం జి. యడవల్లి గ్రామానికి బొమ్మరబోయిన భార్గవ్ పాటు నాంపల్లి మండలానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి ఈ దందా నడిపిస్తున్నట్లు తెలిసింది. మంగళవారం రాత్రి ఏకకాలంలో టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు చేయగా.. భార్గవ్ ఇంటి వద్ద 20లీటర్లు, రమేష్ ఇంటి వద్ద 60లీటర్ల స్పిరిట్ దొరికినట్లు సమా చారం.
వారిని విచారించగా.. చండూరు మండలం గుండ్రపల్లి శివారులో, గుర్రంపోడు మండలం, నాంపల్లి మండలాల కూడలిలో రమేష్ కి సంబంధించిన రెండెకరాల వ్యవసాయ క్షేత్రం లో సుమారు 1500 లీటర్ల నకిలీ మద్యం నిల్వ చేసి ఉంచినట్లు పోలీసులు గుర్తించారు.
ఈ వ్యవసాయ క్షేత్రం చుట్టూ కంచె, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారని గ్రామస్తులు తెలిపారు. ఈ దందా నాలుగేళ్లుగా కొనసాగుతుందని, ఈ నకిలీ మద్యం దందాలో చండూరుకు చెందిన వ్యక్తులతో పాటు వివిధ పార్టీలకు చెందిన నాయకులు పది మంది ఉన్నట్లు సమాచారం.
వీరంతా నకిలీ మద్యాన్ని తయారుచేసి బ్రాండెడ్ కంపెనీకి చెందిన బాటిల్స్ లో నింపి నాంపల్లి పరిసర మండలాలలోని వైన్ షాపులకు బెల్ట్ షాపులకు గత కొన్ని సంవత్సరాలుగా సరఫరా చేస్తున్నట్లు సమాచారం పోలీసులు గానుగుపల్లి లో చౌదరి జరుపుతున్నారు. మద్యానికి సంబంధించిన డ్రమ్ములు క్యాన్లు తదితర మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
MOST READ :
-
Water : ప్లాస్టిక్ క్యాన్లలో నీరు మంచిదా.. కాదా..!
-
Narayanpet : జిల్లాలో 30 పోలీసు యాక్ట్ అమలు.. జిల్లా ఎస్పీ యోగేష్ గౌతమ్..!
-
Gold Price : గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఈ రోజు తులం ధర..!
-
Pumpkin seeds : గుమ్మడి గింజలు తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోండి.. లేదంటే డేంజరే..!
-
Health : మెదడు చురుగ్గా ఉండాలా.. అయితే ఇలా చేయండి..!









