Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణహైదరాబాద్

Hyderabad : హైదరాబాద్ నగరంలో దంచికొడుతున్న వర్షం..!

Hyderabad : హైదరాబాద్ నగరంలో దంచికొడుతున్న వర్షం..!

హైదరాబాద్ , మన సాక్షి :

హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొడుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. గురువారం సాయంత్రం నుంచే వర్షం పడుతుండగా రాత్రి వరకు కూడా జల్లు పడుతూనే ఉంది.

ఇప్పటి వరకు మార్చి నెలలోనే వేసవి ఎండలు 40 డిగ్రీలకు దాటాయి. దాంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. వేసవి ఎండలతో తెల్లటిల్లుతున్న హైదరాబాద్ ప్రజలకు ఒక్కసారిగా ఉపశమనం కలిగింది. మహారాష్ట్రలో ఏర్పడిన అల్పపీడనం వల్ల తెలంగాణ వైపు వీస్తున్న ఈదురుగాలులతో హైదరాబాదులోని పలు ప్రాంతాలలో వర్షపు జల్లు కురిసింది.

హైదరాబాద్ నగరంలో ఉప్పల్, ఎల్బీనగర్, బంజారాహిల్స్, గచ్చిబౌలి, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, పంజాగుట్ట, అమీర్ పేట్, సికింద్రాబాద్, నాంపల్లి, కూకట్పల్లి తదితర ప్రాంతాలలో వర్షం కురిసింది. దాంతో నగరవాసులకు ఉపశమనం కలిగింది.

MOST READ :

  1. Miryalaguda : సన్నధాన్యం విక్రయించే రైతులకు మద్దతు ధరతో పాటు రూ.500 బోనస్..!

  2. Miryalaguda : పేదల ప్రభుత్వం.. కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి..! 

  3. Nalgonda : టాస్క్ ఫోర్స్ పోలీసుల విస్తృత దాడులు.. నకిలీ మద్యం గుట్టురట్టు..!

  4. Miryalaguda : మిర్యాలగూడ బస్టాండ్ లో తప్పిన ప్రమాదం..!

మరిన్ని వార్తలు