Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!
Gold Price : దిగిరానున్న బంగారం ధర.. రూ.61 వేలకే.. భారీ ఊరట..!
మన సాక్షి, బిజినెస్ :
ఇప్పుడు బంగారం ధరలు కొండెక్కుతున్నాయి. తులం బంగారం లక్ష రూపాయలకు చేరువలో ఉంది. సామాన్యులు బంగారం కొనుగోలు చేయాలంటే చాలా కష్టంగా మారింది. కాగా ఈ పెరుగుతున్న ధరలు ఎంతో కాలం ఉండవని రాబోయే రోజుల్లో భారీగా తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు 36% వరకు తగ్గవచ్చునని అంటే ఔన్స్ కు రెండువేల డాలర్ల వరకు తగ్గవచ్చునని బంగారం విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
అదే జరిగితే పెట్టుబడులకు భారీ దెబ్బ.. కానీ కొనుగోలుదారులకు మాత్రం శుభవార్త అందుతుంది. నిపుణుల అంచనా ప్రకారం రాబోయే రోజుల్లో బంగారం ధర తగ్గితే భారత్ మార్కెట్లో 10 గ్రాముల తులం బంగారం కు 61 వేల రూపాయలకే ఉంటుందని అంచనా.
ఎప్పుడు తగ్గుతుంది :
బంగారం ధర ఔన్స్ కు 1820 డాలర్లకు 2029 నాటికి తగ్గుతుందని మార్నింగ్ స్టార్ విశ్లేషకుడు జాన్ మిల్స్ గతంలో అంచనా వేశారు. కానీ ఇప్పుడు దానిని ఔన్స్ కు 2000 డాలర్లకు సవరించారు. అదే సమయంలో 2025, 2027 మధ్య బంగారం సగటు ఔన్స్ కు 3170 డాలర్లుగా అంచనా వేశారు. మిల్స్ అంచనా నిజమైతే బంగారం ధరలు ప్రస్తుత రికార్డు స్థాయి నుంచి 36% తగ్గే అవకాశం ఉంది.
ఎందుకు తగ్గుతాయి :
బంగారం ధరలు తగ్గడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయని మిల్స్ పేర్కొన్నారు. వాటిలో మొట్టమొదటిది బంగారం సరఫరాలో పెరుగుదల. బంగారం ధరలు పెరగటం వల్ల మైనింగ్ కంపెనీలు ఉత్పత్తిని పెంచాయి. మార్కెట్లో బంగారం సరఫరా పెరిగినప్పుడు దాని ధరలపై ఒత్తిడి పెరుగుతుంది. దాంతోపాటు రీసైక్లింగ్ బంగారం కూడా పెరుగుతుంది. దాంతో అదనపు సరఫరా పెంచుతుంది. ఇవి ధరలు తగ్గించడానికి ప్రధాన కారణం కావచ్చు. దాంతో పాటు డిమాండ్ కూడా తగ్గుతుంది. బంగారం కోసం విపరీతమైన డిమాండ్ తగ్గే అవకాశం ఉందని కొన్ని సూచనలు ఉన్నాయి.
వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ నిర్వహించిన నివేదికలో 2023లో 71% కేంద్ర బ్యాంకులు తమ బంగారు నిల్వలు స్థిరంగా ఉంచుతామని, రాబోయే 12 నెలలు తగ్గించుకుంటామని చెప్పాయి. మార్కెట్లో బంగారం సరఫరా పెరిగి డిమాండ్ తగ్గినప్పుడు సహజంగానే ధరలు తగ్గుతాయి. బంగారం ధరలు ప్రస్తుతం గరిష్ట స్థాయికి చేరుకున్నందున ఇక అంతకంటే ముందుకు వెళ్ళదని తెలుస్తుంది. కచ్చితంగా బంగారం ధరలు తగ్గుతాయని మిల్స్ అంచనా వేశారు.
Similar News :
-
Gold Price : గోల్డ్ ఆల్ టైం రికార్డ్.. ఈ రోజు తులం ధర..!
-
Gold Price : ఎవరెస్ట్ ఎక్కిన గోల్డ్ ధర.. తులం ఎంతంటే..!
-
Gold Price : కుప్పకూలింది.. భారీగా పడిపోయిన పసిడి ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్..!
-
Gold Price : భారీగా దిగివచ్చిన బంగారం.. ఇదే గోల్డెన్ ఛాన్స్.. లేటెస్ట్ అప్డేట్..!
-
Gold Price : మోత మోగుతున్న బంగారం ధర.. ఈరోజు ఎంతంటే..!









