Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!

Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలుగు రాష్ట్రాలలో బంగారం ధరలు తగ్గుతున్నాయనుకుంటున్న తరుణంలో జెడ్ స్పీడులో రేటు పెరుగుతోంది. రెండు రోజులుగా భారీ స్థాయిలో ధర పెరిగింది. గురువారం 100 గ్రాములకు ఒక్కరోజే 29,400 రూపాయలు పెరగగా శుక్రవారం రెండవ రోజు వరుసగా 204,00 పెరిగింది. మరో రెండు రోజుల్లో తులం బంగారం లక్ష రూపాయలకు చేరువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 95 వేల రూపాయలకు మార్కు కూడా దాటింది.
హైదరాబాదులో 100 గ్రాముల 24 క్యారెట్ తులం బంగారం శుక్రవారం 20,200 రూపాయలు పెరిగి 9,54,000 రూపాయలకు చేరింది. అదేవిధంగా 22 క్యారెట్స్ 100 గ్రాముల బంగారం ఒక్కరోజే 18,500 పెరిగి 8,74,500 రూపాయలకు చేరింది.
తులం బంగారం ధర..?
హైదరాబాద్ నగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పట్టణాల్లో పెరుగుతున్న బంగారం ధరల ప్రకారం శుక్రవారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 22 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 87,450 రూపాయలు ఉంది. అదేవిధంగా 24 క్యారెట్స్ 10 గ్రాముల (తులం) బంగారం 95,400 రూపాయలుగా ఉంది. మరో రెండు రోజుల్లో లక్ష రూపాయల మార్కు చేరి రికార్డు సృష్టించనున్నదని వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు.
Similar News :









