తెలంగాణBreaking Newsవ్యవసాయం

TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ మరో భారీ శుభవార్త తెలియజేసింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు నాణ్యమైన విత్తనాలు అందజేయడానికి కొత్త పథకాన్ని ప్రారంభించనున్నది. రైతులు విత్తనాల నాణ్యత లోపంతో నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూన్ మొదటి వారంలో ఈ నూతన కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ విత్తనం అనే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 12 వేల గ్రామాలలో ప్రతి గ్రామం నుంచి మూడు నుంచి ఐదుగురు ఆసక్తి కలిగిన అభ్యుదయ రైతులకు జూన్ మొదటి వారంలో ఈ పథకం ద్వారా విత్తనాలను పంపిణీ చేయనున్నారు. ఈ పథకంలో సుమారుగా 2500 నుంచి 3000 క్వింటాళ్ల ఐదు రకాల విత్తనాలను పంపిణీ చేస్తారు. కంది, వరి, పెసర, మినుము, జొన్న విత్తనాలను రాష్ట్రవ్యాప్తంగా 40,000 మంది రైతులకు పంపిణీ చేస్తారు.

అయితే ఈ పథకం ద్వారా నాణ్యమైన విత్తనాలు పొందిన రైతులు వారి వ్యవసాయ భూమిలో పండించిన విత్తనాలను తిరిగి ఆయా గ్రామాలలో తోటి రైతులకు తక్కువ ధరకు అందజేయాల్సి ఉంది. ఈ విధంగా మూడు సంవత్సరాల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ నాణ్యమైన విత్తనాలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రభుత్వం చేపట్టే ఈ నూతన కార్యక్రమం ద్వారా నకిలీ విత్తనాలతో రైతులు మోసపోకుండా రక్షించబడతారు. దాంతోపాటు నూతన నాణ్యమైన విత్తనాల వల్ల రైతులకు 10 శాతం నుంచి 15% వరకు అధిక దిగుబడి కూడా వచ్చే అవకాశం ఉంది.

MOST READ : 

  1. Gold Price : జెడ్ స్పీడులో గోల్డ్.. ఒక్కరోజే రూ.20,200.. తులం ఎంతంటే..!

  2. Curd Rice : రోజూ పెరుగన్నం తింటున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!

  3. ACB : లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్సై.. లంచం ఎంతో తెలుసా..!

  4. Miryalaguda : మీ ధాన్యం కు మద్దతు ధర రాలేదా.. సబ్ కలెక్టర్ ప్రత్యేక చర్యలు..!

  5. Spinach: ఈ ఆహారం.. బట్టతల బాధితులకు వరం..!

మరిన్ని వార్తలు