ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య
Inter : ఇంటర్ లో మెరిసిన రైతు బిడ్డ స్రవంతి..!

Inter : ఇంటర్ లో మెరిసిన రైతు బిడ్డ స్రవంతి..!
రామసముద్రం, మనసాక్షి
ఆంధ్రప్రదేశ్ లోని అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం అవులపల్లికి గ్రామానికి చెందిన స్రవంతి శనివారం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచింది. ఆవులపల్లి గ్రామానికి చెందిన సామాన్య రైతు దొరస్వామి,పార్వతి, దంపతుల కుమార్తె స్రవంతి రామసముద్రం లోని కస్తూరిబా గాంధీ బాలికల కళాశాల లో ఇంటర్ సీఈసీ ద్వితీయ సంత్సరం చదువుతుంది.
సీఈసీలో 910/1000 మార్కులు సాధించి ప్రతిభను కనబరిచింది. దీంతో కళాశాల ప్రిన్సి పాల్ మస్తాన్ బీ, తల్లిదండ్రులు అభినందించారు. భవిష్యత్లో ఉన్నత స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు.గ్రామస్థులు మండల ప్రజలు అభినందనలు తెలిపారు.
MOST READ :









