Miryalaguda : సన్న బియ్యంతో సహపంక్తి భోజనం..!
Miryalaguda : సన్న బియ్యంతో సహపంక్తి భోజనం..!
మిర్యాలగూడ, మన సాక్షి :
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం విజయవంతమైంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని దొండవారిగూడెం, లక్ష్మీపురం, చిరుమర్తి, గ్రామాలలో శనివారం లబ్ధిదారుల ఇళ్ళలో స్థానిక శాసనసభ్యులు భత్తుల లక్ష్మారెడ్డి సహాపంకి భోజనం చేశారు. ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడి సన్నబియ్యం వివరాలు తెలుసుకున్నారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సన్నబియ్యంతో పేదల కడుపు నిండుతుందన్నారు. పేదవారిని ఎవరిని మందలించినా సన్న బియ్యం పంపిణీ సంతోషకరంగా ఉందని పేర్కొంటున్నట్లు ఆయన తెలిపారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే ఎన్నో హామీలను అమలుచేసి ప్రజాపాలన అందిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డికి పేదలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు.
MOST READ :
-
Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!
-
T-20 : క్రికెట్ ప్రియులకు గుడ్ న్యూస్.. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఆ.. సేవలు..!
-
TG News : తెలంగాణలో పెన్షన్ దారులకు భారీ గుడ్ న్యూస్.. ఇకపై పెన్షన్ కోసం నో టెన్షన్..!
-
TG News : తెలంగాణ రైతులకు భారీ గుడ్ న్యూస్.. మరో నూతన కార్యక్రమం ప్రారంభం..!









