ఆంధ్రప్రదేశ్Breaking Newsవిద్య

Inter Result : ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు..!

Inter Result : ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు..!

రామసముద్రం, మనసాక్షి :

ఇంటర్మీడియట్ మొదటి మరియు రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శనివారం ఉదయం 11.00 గంటలకు విడుదల చేశారు. ఈ ఫలితాలలో రామసముద్రం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్ధినీ, విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారు.

ద్వితీయ సి ఇ సి విద్యార్థి .గగన్ 1000 మార్కులు గాను 915 మార్కులు సాధించి కళాశాలలో ప్రథమ స్థానంలో నిలిచారు. ద్వితీయ ఎంపీసీ విద్యార్థిని పి . వైష్ణవి 903/ 1000 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచింది. ద్వితీయ సి ఇ సి విద్యార్థిని పి . చందు 841/ 1000తృతీయ స్థానంలో నిలిచింది.
రెండవ సంవత్సరం విద్యార్థులు 69.56% ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. అంతేకాకుండా తొమ్మిది మంది ఏ గ్రేడ్ లు, 12 మంది బి గ్రేడ్ లు సాధించారు.
మొదటి సంవత్సరం ఫలితాలలో సి ఇ సి విద్యార్థిని గీత 432/500 మార్కులు సాధించి కళాశాల ప్రథమ స్థానం నిలిచింది.

సి ఇ సి విద్యార్థి ఎం .అమిత్ కుమార్ 410/ 500 సాధించి కళాశాల రెండవ స్థానంలో నిలిచారు. సి ఇ సి విద్యార్థి ఎస్ .బాబు 393/ 500 మార్కులు సాధించి కళాశాల మూడవ స్థానంలో నిలిచారు. ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థినీ విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ మరియు అధ్యాపక బృందం అభినందించారు.

MOST READ ; 

  1. Inter : ఇంటర్ లో మెరిసిన రైతు బిడ్డ స్రవంతి..!

  2. Miryalaguda : జాతీయస్థాయి ఖోఖో లో రాణించిన మన క్రీడాకారిణి..!

  3. Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!

  4. Summer Tips: ఎండాకాలంలో తప్పనిసరిగా తీసుకోవాల్సిన డ్రింక్స్ ఇవే..!

  5. Heart care : మీ గుండె ఆరోగ్యంగా ఉండాలంటే… ఇవి తినండి..!

మరిన్ని వార్తలు