తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుసూర్యాపేట జిల్లా

వడగండ్ల వానతో అపార నష్టం.. నేలరాలిన మామిడి, పడిపోయిన వరి..!

వడగండ్ల వానతో అపార నష్టం.. నేలరాలిన మామిడి, పడిపోయిన వరి..!

అర్వపల్లి, మన సాక్షి :

వడగండ్ల వానతో సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం లో రైతులు తీవ్రంగా నష్టపోయారు. రెండు రోజులలో పంట చేతికి వస్తుందని ఆశతో ఎదురుచూసిన రైతులకు వడగండ్ల వాన గాలి దుబరంతో తీవ్రంగా నష్టపోయారు. మండల పరిధిలోని జాజిరెడ్డిగూడెం శివారు గ్రామం అర్వపల్లి, పర్సాయ పెళ్లి, బొల్లంపల్లి కాసర్ల పాడు, దావుల నగర్, ప్రజలకు వడగండ్ల వానతో నష్టం జరిగింది.

నష్టపోయిన రైతులు ప్రభుత్వ అధికారులకు తెలియజేసేందుకు ప్రయత్నిస్తే చాలామంది అధికారులు అందుబాటులో లేరని ప్రజలు అంటున్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలపై దృష్టి పెట్టడంతో రైతుల బాధలను పట్టించుకోవడంలేదని స్థానిక రైతు దాసరి ఏక స్వామి తన ఆవేదనను వెలిబుచ్చారు.

తనకున్న వ్యవసాయ భూమి రాళ్లవానతో వడ్లు మొత్తం కూడా రాలిపోయాయని, గాలి దుమారంతో మామిడి తోట నాశనం అయిందని, తనకు చావు తప్ప గత్యంతరం లేదని కన్నీటి పరంతామయ్యారు.
ప్రభుత్వం తమకు సహాయం చేయాలని నష్ట పోయిన రైతులు కోరుతున్నారు.

MOST READ : 

  1. UPI : భారత్ సొంత చెల్లింపుల యాప్‌ భీమ్.. పైసోం కా కదర్ పేరుతో కొత్త ప్రచారం..!

  2. Inter Result : ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు..!

  3. Suryapet : చోరీకి గురైన 111 ఫోన్లు రికవరీ.. బాధితులకు అందజేసిన జిల్లా ఎస్పీ..!

  4. Inter Result : ఇంటర్ పరీక్ష ఫలితాల్లో మెరిసిన ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు..!

  5. Miryalaguda : గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డులో స్థానం.. మిర్యాలగూడ సిరిమువ్వ నాట్యలయ చిన్నారులు..!

మరిన్ని వార్తలు