District collector : జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి.. పారదర్శకంగా భూభారతి..!
District collector : జిల్లా కలెక్టర్ రైతులతో ముఖాముఖి.. పారదర్శకంగా భూభారతి..!
చింతపల్లి, మనసాక్షి :
ధరణి స్థానంలో కొత్త భూమి హక్కుల రికార్డు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. గురువారం చింతపల్లి మండలంలో జిల్లాలోని ప్రధమంగా ఈ భూభారతి చట్టం ప్రాజెక్టును ప్రారంభించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా రైతులతో ముఖాముఖి మాట్లాడుతూ భూభారతి చట్టంపై నూతన విధివిధానాలను వివరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆ ధరణి పోర్టల్ లో లేని అనేక సమస్యలకు పరిష్కారం భూభారతి చట్టం ద్వారా పొందవచ్చునున్నారు. జూన్ 2 నుండిఆన్లైన్లోభూభారత్ చట్టంపోర్టల్ పనిచేస్తుందన్నారు. భూములకు సంబంధించిన సమస్యలపైరైతులు మీ సేవలో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ డిసెంబర్ 31న భూభారతి చట్టంలోని రికార్డులను అప్డేట్ చేయడం జరుగుతుంది అన్నారు.
సాదా బైనా మాకు సంబంధించిన అన్నింటి వివరాలు భూభారతి చట్టంలో పొందుపరచడం జరిగిందన్నారు. భూ భారతి చట్టం ద్వారా రైతులకు సంబంధించిన భూముల విషయాలపై చట్టం పారదర్శకంగా పనిచేస్తుందని వారు వివరించారు. దీంతో అన్ని వర్గాలకు సంబంధించిన రైతులకు న్యాయం చేకూరుతుందని వారు వ్యాఖ్యానించారు. ఈ అవకాశాన్ని రైతులందరూ సద్వినియోపరుచుకోవాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్, జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ ఆర్డీవో రమణారెడ్డి, అడిషనల్ ఎస్పీ మౌనిక, తాసిల్దార్ రామకాంత్ శర్మ, ఎంపీడీవో సునీత, మాల్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంతం అలివేలు, పిఎసి చైర్మన్ లింగంపల్లి వెంకటయ్య, మునుగోడు మాజీ ఎమ్మెల్యే వు జ్జిని నాగేశ్వరరావు, డిప్యూటీ తాసిల్దార్ ఎండి అసద్, మండల వ్యవసాయ శాఖ అధికారిశ్రావణ కుమారి, రైతులు పలు శాఖల అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
MOST READ :
-
UPI : బిగ్ అలర్ట్.. మార్కెట్లోకి నకిలీ ఫోన్ పే, గూగుల్ పే యాప్స్..!
-
Miryalaguda : నకిలీ షూరిటీ లు కోర్టు లో పెట్టినందుకు జైలు శిక్ష, జరిమానా..!
-
Mutual Fund : ఆ బ్యాంకు ఇన్వెస్టర్లకు శుభవార్త.. మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు సులభతరం..!
-
Mutual Fund : ఆ బ్యాంకు ఇన్వెస్టర్లకు శుభవార్త.. మ్యూచువల్ ఫండ్ లావాదేవీలు సులభతరం..!
-
Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. మహిళ పై యాసిడ్ తో దాడి కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు..!









