తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుమెదక్

District collector : ప్రతి రైతుకు భూభారతితో న్యాయం.. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్..!

District collector : ప్రతి రైతుకు భూభారతితో న్యాయం.. అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్..!

టేక్మాల్, మన సాక్షి :

భూ సమస్యల సత్వర పరిష్కారం కోసం “భూ భారతి” చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం మెదక్ జిల్లా టేక్మాల్ మండల కేంద్రంలోని రైతు వేదికల్లో నిర్వహించిన భూ భారతి – ఆర్ఓఆర్ చట్టంపై అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆర్డిఓ రమాదేవి తాసిల్దార్ తులసీరామ్ ఎంపీడీవో విటల్ సంబంధిత, ప్రజా ప్రతినిధులు ప్రభుత్వ అధికారులు రైతులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా భూముల రికార్డులు పారదర్శకంగా నిర్వహించి, భవిష్యత్ తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించడమే తెలంగాణ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని భూమి కలిగిన ప్రతి ఒక్కరికీ ఈ భూ భారతి చట్టం ద్వారా న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు.

ధరణిలో పలు భూ సమస్యల పరిష్కారానికి అవకాశాలు లేవని, అలాంటి ఈ భూ భారతి చట్టం కింద ఎటువంటి భూ సమస్యలు అయినా సరే ఖచ్చితంగా పరిష్కారమవుతాయన్నారు.
భూ కబ్జాలు, అక్రమాలు, వివాదాలను తొలగించి, రైతులకు భద్రత కల్పించేందుకు ఈ చట్టం కీలకంగా పనిచేస్తుందన్నారు.

సమస్యల పరిష్కారం దిశగా ఈ భూ భారతి చట్టంలో ఎలాంటి అవకాశాలు ఉన్నాయో తెలుసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉందన్ని ప్రథమంగా ఈ చట్టంలోని సెక్షన్ – 4(4) ప్రకారం.. ఎవరైనా రైతుల భూమికి సంబంధించి రికార్డులో లేకున్నా, తప్పుగా ఉన్నా, రికార్డు వేరే పేరు మీద ఉన్నా కానీ సర్వే నంబర్ మారిపోయినా, అటువంటి సమస్య కలిగిన వారు తహసీల్దార్ కు దరఖాస్తు చేసుకొవలన్నారు.

అలాగే ఈ చట్టం ద్వారా సేల్ డీడ్ కింద పూర్తి వివరాలను ప్రస్తావించవచ్చని, భూముల సర్వే మ్యాపు, సాదా బైనామాల క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిందని, రెండంచెల అప్పీల్ పద్ధతి భూ భారతిలో ఉందని, భూ భారతి ద్వారా 30 రోజుల్లో మ్యుటేషన్ చేయకపోతే 31వ రోజు స్వయంచాలికంగా (ఆటోమేటిక్) మ్యుటేషన్ జరుగుతుందని, నిషేధిత భూములు, కోర్టు కేసుల్లో ఉన్న భూములన్నింటికి భూ భారతిలో పరిష్కారానికి అవకాశం ఉందని వెల్లడించారు.

ఈ అవగాహన సదస్సులో మెదక్ జిల్లా ఆర్టిఏ సభ్యులు మల్లారెడ్డి జోగిపేట్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సత్యనారాయణ, టేక్మాల్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మ రమేష్, యువజన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగమేశ్వర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు సుబేదార్ మాన్ కిషన్ సాగర్ మజార్ అధికారులు, సిబ్బంది, అధిక సంఖ్యలో రైతులు, రైతు సంఘాల నాయకులు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Narayanpet : ఈదురు గాలులతో భారీ వర్షం.. విరిగిన విద్యుత్ స్తంభాలు, కూలిన చెట్లు..!

  2. TG News : పేద, మధ్యతరగతి ప్రజలకు కన్నీళ్లు తెప్పించే.. ఉల్లి ధరలు ఎంతో తెలుసా..!

  3. Rythu Bharosa : రైతులకు తీపి కబురు.. రైతు భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం.. లేటెస్ట్ అప్డేట్..!

  4. TG News : పెన్షన్ నో టెన్షన్.. పెన్షన్ దారులకు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్..!

  5. TGSRTC : తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ.. నోటిఫికేషన్ పై మంత్రి పొన్నం కీలక ప్రకటన..!

మరిన్ని వార్తలు