Miryalaguda : అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టివేత..!
Miryalaguda : అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు పట్టివేత..!
మిర్యాలగూడ, మన సాక్షి :
నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను శుక్రవారం రూరల్ పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ మండలం తడకమళ్ళ గ్రామ శివారులో అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లుగా వచ్చిన సమాచారం మేరకు పోలీసులు వెళ్లారు.
కాగా తక్కెలపాడు గ్రామ శివారులోని మూసి వద్దకు వెళ్లగా అక్కడ నాలుగు ట్రాక్టర్లు ఇసుకతో నింపి ఉన్నాయి. పోలీసులు వస్తున్న విషయాన్ని గమనించిన వారు మూడు ట్రాక్టర్ల యజమానులు ట్రాలీ అక్కడే వదిలి ఇంజన్లతో పాటు పారిపోయారు.
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లకు రెండు ట్రాలీలకు నెంబర్లు ఉండగా మరో రెండు ట్రాలీలకు నెంబర్ ర్యాలీలకు నెంబర్లు లేవు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండలం దాసారం గ్రామానికి చెందిన జనార్ధన్, సైదులు, నరేందర్ అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లుగా తెలియడంతో వారిపై కేసు నమోదు చేసి ఇసుక ట్రాక్టర్లను పోలీస్ స్టేషన్ కు తరలించారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే కొత్త ఫీచర్.. నో ఎక్స్ పోర్ట్, నో డౌన్ లోడ్.. మరింత భద్రత..!
-
BREAKING : ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి..!
-
Miryalaguda : భూభారతిలో ప్రతి ఏటా డిసెంబర్ 31న భూముల వివరాల ప్రదర్శన.. జిల్లా కలెక్టర్ వెల్లడి..!
-
Hyderabad : హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం విజయం..!
-
Miryalaguda : ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ పరీక్షల్లో అవకతవకలు.. విచారణ జరపి చర్యలు తీసుకోవాలి..!









