Paddy : కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యం రవాణా.. చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు..!
Paddy : కర్ణాటక నుంచి అక్రమంగా ధాన్యం రవాణా.. చెక్ పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రబీ సీజన్లో నారాయణపేట జిల్లా లోకి పోరుగు రాష్ట్రం కర్ణాటక నుండి అక్రమంగా వరి ధాన్యం రాకుండా ఉండేందుకు నారాయణపేట జిల్లా పరిధిలో మొత్తం ఆరు చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగిందని డిఎస్పి నల్లపు లింగయ్య తెలిపారు. చెక్పోస్ట్ దగ్గర పకడ్బందీగా తనిఖీలు నిర్వహించడం జరుగుతుందని డీఎస్పీ తెలిపారు.
బుధవారం సాయంత్రం జలాల్పూర్ చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనాలు తనిఖీ చేయు విధానాన్ని మరియు రిజిస్టర్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చెక్ పోస్ట్ ల దగ్గర విధులు నిర్వర్తించే పోలీసు, రెవెన్యూ అధికారులు అప్రమత్తంగా ఉండి కర్ణాటక రాష్ట్రం నుండి జిల్లాలోకి వరి ధాన్యం రాకుండా చూడాలని ప్రతి వాహనానీ తనిఖీ చేస్తూ వాహనాల నెంబర్లను రిజిస్టర్ లో నమోదు చేయాలని తెలిపారు.
వరి ధాన్యం వాహనాలు వస్తే రెవెన్యూ అధికారులకు అప్పగించాలని లేదా వాహనాలను తిప్పి పంపివేయాలని సూచించారు. చెక్పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉండి వచ్చి పోయే వాహనాలను జాగ్రత్తగా గమనిస్తూ వాహనాలను తనిఖీ నిర్వహించాలని సూచించారు.
చెక్ పోస్ట్ దగ్గర అప్రమత్తంగా ఉంటూ వేసవికాలంలో ఎండలు బాగా ఉన్నందున ఎండల నుండి జాగ్రత్తలు తీసుకోవాలని తరచుగా నీళ్లు ఎక్కువగా తీసుకోవాలని అక్కడ ఉన్న సిబ్బందికి సూచించారు. చెక్ పోస్ట్ దగ్గర ఏమైనా సమస్యలు ఉన్నాయని అడిగి తెలుసుకుని లోకల్ పోలీసు అధికారులకు భద్రతాపరమైన సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
-
Hot Water : ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా.. ఎవరు తాగకూడదో తెలుసుకుందాం..!
-
TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!
-
Mango: కల్తీ మామిడిపండ్లను ఇలా గుర్తించాలి..!
-
TG News : తెలంగాణలో మహిళలకు భారీ గుడ్ న్యూస్.. 50శాతం సబ్సిడీ..!
-
TGSRTC : ఆర్టీసీ బస్సులో కల్లు తీసుకెళ్లొద్దని ఎవరు రూల్ పెట్టారు.. బస్సు ఎదుట మహిళ నిరసన.. (వీడియో)
-
NREGS : ఉపాధి హామీ సిబ్బందికి సర్కార్ గుడ్ న్యూస్..!









