TOP STORIESBreaking Newsఆరోగ్యం

Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!

Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!

మన సాక్షి:

వేసవిలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. శరీరానికి తగినంత తేమ అందాలంటే ప్రతిరోజు ఎక్కువ నీరు తాగడం చాలా ముఖ్యం. వేడి ఎక్కువగా ఉన్న రోజుల్లో కనీసం ఎనిమిది గ్లాసుల నీరు తాగాలి. దీనికి అదనంగా కొబ్బరినీరు, నిమ్మరసం వంటి ద్రవాలు తీసుకుంటే శరీరంలో నీటి శాతం సరిగ్గా ఉంటుంది. నీటి ద్వారా లోపలికి వెళ్లే తేమ ముక్కు పొడిబారే సమస్యను తగ్గిస్తుంది.

వేసవిలో పొడి గాలి ప్రభావం ముక్కు లోపలి చర్మాన్ని ఎండిపోయేలా చేస్తుంది. ఈ సమస్యను నివారించడానికి వాసెలిన్ లేదా ప్రత్యేకంగా ముక్కు కోసం తయారుచేసిన మాయిశ్చరైజర్‌ను రోజుకు రెండు మూడు సార్లు ఉపయోగించాలి. ఇది లోపలి పొరలకు తేమను అందించి పగుళ్లు ఏర్పడకుండా, తద్వారా రక్తస్రావం కాకుండా కాపాడుతుంది. బయట ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు నేరుగా సూర్యకాంతి తగలకుండా జాగ్రత్త వహించాలి. తలకు స్కార్ఫ్ లేదా పలుచని బట్ట కట్టుకోవడం వల్ల వేడి ప్రభావం తగ్గుతుంది.

ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో సహాయపడుతుంది..ఇంట్లో గాలిలో తేమ శాతం తక్కువగా ఉంటే ముక్కు ఎండిపోయి అసౌకర్యంగా ఉంటుంది. అలాంటప్పుడు హ్యూమిడిఫైయర్ లేదా తక్కువ ఉష్ణోగ్రతలో పనిచేసే ఏసీ వాడితే గాలిలో తేమ పెరుగుతుంది. ఇది ముక్కును తడిగా ఉంచుతుంది.

నిర్లక్ష్యం వద్దు.

ముక్కు దిబ్బడగా ఉన్నప్పుడు గట్టిగా ఊపిరి పీల్చినా లేదా బలంగా తుమ్మినా లోపలి రక్తనాళాలు పగిలిపోయే అవకాశం ఉంది. కాబట్టి, ముక్కును మెల్లగా శుభ్రం చేయాలి. సలైన్ స్ప్రే వాడితే ముక్కు శుభ్రం అవుతుంది, తేమగా కూడా ఉంటుంది. పొడిబారిన ముక్కులో కొందరికి దురదగా అనిపించవచ్చు.

అలాంటప్పుడు గోకడం వల్ల లోపలి సున్నితమైన నాళాలు దెబ్బతిని రక్తం కారుతుంది. అందుకే చేతులతో ముక్కును గోకకుండా జాగ్రత్త పడాలి. నిద్రపోయే సమయంలో తల కొంచెం ఎత్తుగా ఉండేలా దిండు పెట్టుకుంటే ముక్కు మీద ఎక్కువ ఒత్తిడి పడదు. దీనివల్ల రాత్రిపూట ముక్కులోంచి రక్తం వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

తరచుగా ముక్కులోంచి రక్తం కారుతుంటే లేదా ఒకేసారి ఎక్కువ మొత్తంలో వస్తే నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఇది దీర్ఘకాలిక సమస్య అయితే అసలు కారణాన్ని తెలుసుకొని సరైన చికిత్స తీసుకోవడం చాలా ముఖ్యం. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి..!

By : Prashanth,  Hyderabad 

MOST READ : 

  1. Free Bus : తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పై సజ్జనార్ కీలక ప్రకటన..!

  2. Free WorkShop : ఉచిత బ్యూటీషియన్ ట్రైనింగ్ వర్క్‌షాప్..!

  3. Lemon: ఎండిపోయాయని నిమ్మకాయల్ని పడేస్తున్నారా… అయితే మీరు తప్పు చేస్తున్నట్లే..!

  4. Gold Price : భారీగా తగ్గిన గోల్డ్.. కొనుగోలుకు ఇదే మంచి ఛాయిస్..!

  5. Watermelon : తొక్కే కదా అని తీసి పడేస్తున్నారా.. ఇది తెలిస్తే అస్సలూ వదలరు..!

మరిన్ని వార్తలు