Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన బొలెరో..!
Nalgonda : నల్గొండ జిల్లా మాడుగులపల్లి లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను ఢీకొట్టిన బొలెరో..!
మాడుగులపల్లి, మనసాక్షి :
నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. మాడుగులపల్లి మండల కేంద్రంలో రోడ్డు ప్రమాదం లో ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానిక ఎస్సై కృష్ణయ్య తెలిపిన వివరాల ప్రకారం..
బుధవారం ఉదయం రుద్రారం గ్రామానికి చెందిన గంధం వీరయ్య ట్రాక్టర్ పైన అదే గ్రామానికి చెందిన నల్లగంతుల రామయ్య, కుర్ర మాధవ్, కొండ నాగయ్య మరికొంత మంది మాడుగుల పల్లి మండలం దాచారం చెరువులో చేపలు పట్టడానికి వస్తుండగా మాడుగుల పల్లి గ్రామ శివారులో గల పెట్రోల్ బంకు వద్ద ఈ ప్రమాదం జరిగింది.
మిర్యాలగూడ వైపు నుండి వస్తున్నటువంటి బూలెరో ట్రాక్టర్ ను వెనుక వైపు నుండి ఢీ కొట్టడంతో ట్రాక్టర్ లో ఉన్నటువంటి వ్యక్తులు కింద పడడంతో ట్రాక్టర్ డ్రైవర్ వీరయ్య కు నల్లగంతుల రామయ్యకు బలమైన గాయాలు కావడంతో వారిని నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా నల్లగంతుల రామయ్య మృతి చెందాడని. అతని భార్య నల్లగంతుల నాగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై కృష్ణయ్య తెలిపారు.
MOST READ :
-
District collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..!
-
Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!
-
Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!
-
Nose: ముక్కులో నుంచి రక్తం వస్తోందా.. అయితే ఈ ముప్పు ఉన్నట్లే..!
-
Hyderabad : చిత్రపురి కాలనీ ల్యాండ్ మార్క్.. 40 నెలల్లోనే ప్రాజెక్టు పూర్తి..!









