తెలంగాణBreaking Newsనారాయణపేట జిల్లావిద్యసామాజిక సేవ

Narayanpet : పేద విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత..!

Narayanpet : పేద విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చేయూత..!

నారాయణపేట టౌన్, మనసాక్షి :

పేదరికం కారణంగా చదువుకు దూరమవుతున్న విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తమ ఫౌండేషన్ కృషి చేస్తుందని రాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కే.రాజ్ కుమార్ రెడ్డి అన్నారు. ఇటీవల వెలువడిన పరీక్షా ఫలితాలలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ ల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థినీ విద్యార్థులకు భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె రాజ్ కుమార్ రెడ్డి బుధవారం ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

ఇంటర్మీడియట్ లో 989/1000 మార్కులు సాధించిన నారాయణపేట అశోక్ నగర్ కు చెందిన కే.పావనికి రూ.25వేలు, ఇంటర్మీడియట్ లో 958/1000 మార్కులను సాధించిన సింగారం గ్రామానికి చెందిన బి.భరత్ కు రూ.20వేలు, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 469/470 మార్కులను సాధించిన దామరగిద్ద గ్రామానికి చెందిన అక్షయకు రూ.25వేలు, 10వ తరగతిలో 566/600 మార్కులను సాధించిన వందరగుట్ట తాండకు చెందిన ఆటోడ్రైవర్ బాలునాయక్ కుమార్తె హరిషకు రూ. 20వేలు, 10వ తరగతిలో 566/600 మార్కులను సాధించిన జిల్లా కేంద్రం బాపునగర్ కు చెందిన కార్తీకేయకు రూ.25వేల చొప్పున ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేశారు.

ఈ సందర్భంగా రాజ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పేదరికం కారణంగా చదువులకు దూరం అవుతున్న పేద విద్యార్థినీ విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు తమవంతు కృషి చేస్తున్నామని తెలిపారు. పేదరికంతో బాధపడుతూ పాఠశాలలు, కళాశాలలో ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో ఉన్న ఎంతో మంది విద్యార్థులకు ఫీజులను చెల్లించడం జరిగిందని పేర్కొన్నారు.

చదువుకునే ఆసక్తి ఉండి ఫీజులు కట్టలేక చదువుకు దూరం అవుతున్న వారికి సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు గడ్డం తిప్పన్న, పోలీసు పటేల్ మధుసూదన్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి, గోపాల్ గౌడ్, హన్మంతు ముదిరాజ్, శివరాజ్, వై.సంతోష్, జేవీ.రావు, అశోక్, నర్సింహనాయుడు, ఎం.సంతోష్, కృష్ణ యాదవ్, అఖిల్, నందుకుమార్, వెంకటరావు, మన్నె గోపాల్, విద్యార్థుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

బడీడు పిల్లలను బడిలో చేర్పిద్దాం : రాజ్ కుమార్ రెడ్డి.

పేదరికం కారణంగా విద్యకు దూరమవుతున్న బడేడు పిల్లలను బడిలో చేర్పించేందుకు భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జూన్ 1వ తేదీ నుండి ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె.రాజ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. చదువుకు దూరమయ్యే బాలల వివరాలను సేకరించి వారిని పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీలకతీతంగా ప్రతిఒక్కరూ సహకరించాలని ఆయన కోరారు.

MOST READ : 

  1. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  2. District collector : రైస్ మిల్లర్లకు జిల్లా కలెక్టర్ వార్నింగ్.. రైతులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు..!

  3. Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!

  4. District collector : రైతులకు జిల్లా కలెక్టర్ కీలక సూచన.. వారి వద్ద విత్తనాలు కొనొద్దు.. మోసపోవద్దు..!

  5. Google : గూగుల్ లోగో @ 10 ఇయర్స్.. న్యూ లుక్, డిఫరెంట్ ఏంటి..!

మరిన్ని వార్తలు