తెలంగాణBreaking Newsజిల్లా వార్తలువ్యవసాయంసూర్యాపేట జిల్లా

Rythu : అంతర పంటగా కోకో.. రైతులకు అదనపు ఆదాయం..!

Rythu : అంతర పంటగా కోకో.. రైతులకు అదనపు ఆదాయం..!

సూర్యాపేట, మనసాక్షి :

ఆయిల్ పామ్ తోటలో అంతర పంటగా కోకో పంటను సాగు చేస్తూ రైతులు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. సూర్యాపేట జిల్లా మునగాల గ్రామం లో గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఆయిల్ పామ్ తోటను వేసి పంట సాగు చేస్తూ తద్వారా ఎకరానికి 10 టన్నుల ఆయిల్ పామ్ గెలలు తీస్తూ పామ్ ఆయిల్ గెలల ద్వారా ఆదాయం పొందుతున్నారు.

గత నాలుగు సంవత్సరాల క్రితం ఆయిల్ పామ్ తోటల్లో పామ్ ఆయిల్ చెట్ల నీడలో కో కో పంటను సాగు చేస్తున్నారు. ఎకరం ఆయిల్ ఫామ్ తోటలో 110 నుండి 130 మొక్కలను నాటుతున్నారు. నాటిన మూడు సంవత్సరాల తదుపరి కోకో పంట దిగుబడి ప్రారంభమవుతుంది. మునగాల మండల కేంద్రంలో ఆయిల్ పామ్ తోటలో కోకోను అంతర పంట గా సాగు చేస్తూనా ఎం వి రెడ్డి ఎకరానికి అదనంగా మరో 30000 రూపాయలు ఆదాయం పొందుతున్నారు.

ఈ కో కో మొక్కలు పండిన పంటను (బై బ్యాక్) తిరిగి వారు కొనుగోలు చేసే పద్దతి లో క్యాడ్బరీ కంపెనీ వారు ఇట్టి మొక్కలను మొక్క ఒక్కంటి కు 35 రూపాయలకు విక్రయస్తున్నారు. గత నాలుగు సంవత్సరాల క్రితం కో కో మొక్కలు నాటిన ముస్కు దీనిష్ రెడ్డి, ముస్కు సాకేష్ రెడ్డి వ్యవసాయ క్షేత్రం లో ఈ సంవత్సరం పంట దిగుబడి ప్రారంభం కావడం తో గురువారం పంట కోత ను ప్రారంభించారు.

దీనితో ఎకరానికి 30వెయ్యుల రూపాయలు అదనపు ఆదాయం పొందుతున్నారని పతంజలి ఆయిల్ పామ్ కంపెనీ మేనేజర్ జే హరీష్ తెలిపారు. ఆయిల్ పామ్ తోటలు సాగు చేసే రైతులకు కో కో, బుష్ పేపర్ వంటి నీడ పంటలను చెట్ల నీడలో సాగు చేసి ఆదాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమం లో ఆయిల్ పామ్ ఫీల్డ్ ఆఫీసర్ కే శ్రీనివాస్, తదితరులు ఉన్నారు.

MOST READ. 

  1. Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!

  2. Nalgonda : నల్గొండ జిల్లాలో దొంగల బీభత్సం..!

  3. Hyderabad : మణికొండ మున్సిపాలిటీలో హైడ్రా కమిషనర్ పర్యటన..!

  4. Gold Price : దిగివచ్చిన బంగారం ధర.. కొనుగోలుకు సమయం ఇదే..!

  5. Gold Price : బంగారం ధర డమాల్.. ఒకే రోజు రూ.21,300 తగ్గింది.. ఈ రోజు ఎంతంటే..!

మరిన్ని వార్తలు