District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. మంచి పునాదికి ఉపాధ్యాయులే కీలకం..!
District collector : జిల్లా కలెక్టర్ కీలక వ్యాఖ్య.. మంచి పునాదికి ఉపాధ్యాయులే కీలకం..!
జగిత్యాల, (మన సాక్షి)
జగిత్యాల పట్టణంలోని ఓల్డ్ హైస్కూల్ జడ్పీహెచ్ఎస్ బాలురు, జడ్ పి .హెచ్.ఎస్ బాలికల పాఠశాలల్లో ఉపాధ్యాయులకు నిర్వహించిన వేసవి శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కలెక్టర్ సత్య ప్రసాద్ పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివేందుకు వచ్చే విద్యార్థులకు మెరుగైన బోధన అందించేందుకు పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ మాట్లాడుతూ విద్యా శాఖలో ఒకే రోజు మార్పు సాధ్యం కాదని, నిర్విరామంగా ప్రయత్నం జరుగుతూ ఉండాలని అన్నారు. టీచర్ వృత్తి లో మనం కొనసాగడానికి ఒకే కారణం ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే పిల్లలు మాత్రమేనని, నిరుపేద రైతులు, కూలీలు, బడుగు బలహీన వర్గాల కుటుంబాల నుంచి వచ్చిన పిల్లల జీవితాలను బాగు చేసే అవకాశం మనకు లభించిందని అన్నారు.
భారత దేశంలో యువతకు మంచి విద్య నైపుణ్యం అందించగలిగితే సూపర్ పవర్ గా ఎదుగుతామని అన్నారు. చదువుకునేందుకు సామర్థ్యం లేని పిల్లలు మన దగ్గర ఎవరూ లేరని, సమాజంలో మంచి పునాది ఉండాలంటే ఉపాధ్యాయులు కీలకమని అన్నారు.
జిల్లాలోని ఉపాధ్యాయులకు మే 13 నుంచి మే 31 వరకు కంటెంట్ ఎన్రిచ్మెంట్, డిజిటల్ ఎడ్యుకేషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైఫ్ స్కిల్స్ లెర్నింగ్ అవుట్ కమ్స్ వంటి అంశాల పై గణిత , సోషల్ మండల రిసోర్స్ పర్సన్, స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లు, ఐఆర్పీ లకు శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు.
ఉపాధ్యాయులంతా చిత్తశుద్ధితో కృషి చేస్తే విద్యార్థుల జీవితాల్లో మంచి మార్పు వస్తుందని, వేసవి శిక్షణలో నేర్చుకున్న అంశాలను బోధనలో ఉపాధ్యాయులు అమలు చేయాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి రామ్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
WhatsApp : వాట్సాప్ లో అదిరిపోయే ట్రిక్.. ఫోన్ చూడకుండానే మెసేజ్ చేసింది ఎవరో చెప్పొచ్చు..!
-
Nalgonda : నల్గొండలో జార్ఖండ్, ఉత్తర ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల అనుమానితులు.. ఎయిర్ గన్స్ గంజాయి చాక్లెట్స్, హుక్కా స్వాధీనం చేసుకున్న పోలీసులు..!
-
Fake PassPort ; నకిలీ పాస్ పోర్టులతో విదేశి ప్రయాణానికి యత్నం.. పోలీసుల అదుపులో ఐదుగురు..!
-
Rythu : అంతర పంటగా కోకో.. రైతులకు అదనపు ఆదాయం..!
-
Rythu Bharosa : రైతులకు శుభవార్త.. 4 ఎకరాలకు పైగా రైతు భరోసా ఎప్పుడంటే.. లేటెస్ట్ అప్డేట్..!









