District SP : జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్..!
District SP : జిల్లా ఎస్పీ సంచలన నిర్ణయం.. నకిలీ విత్తనాలు అమ్మితే పి.డి యాక్ట్..!
సూర్యాపేట మనసాక్షి :
నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోవద్దని , అధికారులు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని
జిల్లా ఎస్పీ నరసింహ ఒక ప్రకటనలో కోరారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ సంభందిత అధికారులు అందరూ సమన్వయంగా పని చేసి రైతులకు నకిలీ వితనాలు సరఫరా జరగకుండా చూడాలని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నకిలీ విత్తనాల నిర్మూలనకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగిందాన్నారు.
ఆరుగాలం కష్టపడే రైతు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా విత్తన సంస్థలు, డీలర్లు, వ్యాపారులపై పై ఉన్నదని,విత్తన వ్యాపార డీలర్స్ బాధ్యతగా మంచి నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని కోరారు.రైతులకు, వ్యవసాయానికి నష్టం కలిగేలా నకిలీ విత్తనాలు అమ్మితే అలాంటి వారిపై చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని పీడీ యాక్ట్,షీట్స్ నమోదు చేస్తాం అని హెచ్చరించారు.
సూర్యాపేట జిల్లా ఆంధ్రా ప్రాంతానికి ముఖ్య సరిహద్దుగా ఉన్నది కావున ఇక్కడ నకిలీ విత్తనాలు ఎక్కువగా సరఫరా అయ్యే అవకాశం ఉన్నదని , ముందస్తు తనిఖీలు, రైతులకు అవగాహన కల్పించడం, డీలర్స్ కు అవగాహన కల్పించడం, సరిహద్దు లలో పటిష్టమైన నిఘా తో నకిలీ విత్తనాలు నివారించాలి అని ఎస్పీ అన్నారు.
రైతులతో సమావేశాలు నిర్వహించి చైతన్య పరచాలని , గతంలో నకిలీ విత్తనాలు అమ్మిన వారి పైన ప్రత్యేక నిఘా ఉంచాలని కోరారు. ఎక్కువ మొత్తంలో విత్తనాలు కొనుగోలు చేసే రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాల గురించి, అనుమానిత బ్రోకర్లు, గురించి పోలీసు వారికి, వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు.
MOST READ :
-
Miryalaguda : బాలింత మృతి సంఘటనపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. మిర్యాలగూడ శిరీష హాస్పిటల్ పై మెజిస్టేరియల్ విచారణ..!
-
WhatsApp Chats : మీరు ఇలా చాట్ చేస్తున్నారా.. అయితే మీ బంధం బలహీన పడినట్లే.. ఎందుకో తెలుసుకోండి..!
-
District collector : చేయూత పెన్షన్లపై జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం.. అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. రాజీవ్ యువ వికాసం లబ్ధిదారుల ఎంపికకు గడువు విధింపు..!
-
Rythu Bharosa : రైతుల ఖాతాలలో డబ్బులు.. రైతు భరోసా ఈసారి వారికి కూడా.. లేటెస్ట్ అప్డేట్..!
-
Yugantham : వామ్మో యుగాంతం.. కౌంట్ డౌన్ స్టార్ట్.. ఎప్పుడో తెలిస్తే షాక్..!









