Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!

Rythu Bharosa : వారికే ఒకేసారి రైతు భరోసా.. ఎప్పుడో తెలుసా.. లేటెస్ట్ అప్డేట్..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రైతులకు కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా రైతు భరోసా పథకం నిర్వహిస్తోంది. ఈ పథకాన్ని 2025 జనవరి 26వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే ఈ పథకం ద్వారా రైతులకు ఎకరానికి 12,000 రూపాయలను రెండు విడతలుగా ప్రభుత్వం పంట పెట్టుబడి సహాయంగా అందజేయనున్నది.
యాసంగి సీజన్ కు గాను రైతులకు ఒక విడత ఎకరానికి 6000 రైతుల ఖాతాలలో జమ చేసింది. ఇప్పటివరకు నాలుగు ఎకరాల లోపు సాగు చేసిన రైతులకు మాత్రమే పంట పెట్టుబడి సహాయం అందింది. మిగతా రైతులు రైతు భరోసా కోసం ఎదురుచూస్తున్నారు. కాగా ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రైతు భరోసా పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు.
వానాకాలం వరి నాట్లకు ముందే రైతు భరోసా పథకం పూర్తిస్థాయిలో అమలు చేస్తామని ప్రకటించారు. అయితే ఈసారి రెండు విడుదల పంట పెట్టుబడి సహాయం ఒకేసారి అందజేయనున్నట్లు తెలుస్తుంది. యాసంగి సీజన్లో పెండింగ్ లో ఉన్న రైతులకు పెండింగ్ లో ఉన్న ఎకరానికి 6000 రూపాయలతో పాటు వానకాలం సీజన్ కు సంబంధించి ఎకరానికి 6000 రూపాయలను మొత్తం 12 వేల రూపాయలను ఒకేసారి రైతుల ఖాతాలలో జమ చేయనున్నారు.
జూలై మొదటి వారం నుంచి రైతు భరోసా పథకం అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు నిర్వహిస్తుంది. రైతులు ఆగస్టు మాసంలో వరి నాట్లు వేసుకోవడం ప్రారంభిస్తారు. కాగా జూలైలో పంట పెట్టుబడికి గాను రైతులకు ప్రభుత్వం వారి ఖాతాలలో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.
MOST READ :
-
Miryalaguda : ఆ విత్తనాలు వేస్తే రైతులకు 15 శాతం అధిక దిగుబడి..!
-
Sleep : పగటి పూట నిద్రపోతున్నారా.. అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
-
Gold Price : మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈరోజు తులం ఎంతంటే..!
-
Miryalaguda : విత్తన దుకాణాలలో టాస్క్ ఫోర్స్ తనిఖీలు..!
-
BIG Alert : వాట్సాప్ ఊహించని షాక్.. ఈ ఫోన్ లలో రేపటి నుంచి పనిచేయదు..!










