Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!
Miryalaguda : కరాటే లో గోల్డ్ మెడల్ సాధించిన భువనేశ్వర్.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అభినందనలు..!
దామరచర్ల , మన సాక్షి :
ఆ బాలుడు విద్యలోనే కాకుండా ఆత్మరక్షణ కోసం శిక్షణ తీసుకుంటున్న కరాటే లో ను చురుకైన ప్రతిభను కనబరుస్తూ చిన్ననాటి నుండి ఉత్తమ ప్రతిభను కనబరుస్తూ కరాటే లో గోల్డ్ మెడల్ సాధించి తన ప్రతిభను చాటుకున్నాడు తెట్టకుంట గ్రామానికి చెందిన భువనేశ్వర్.
వివరాలు లోకి వెళ్తే దామరచర్ల మండలం తెట్టకుంట గ్రామానికి చెందిన డీలర్ వసంత్ కుమారుడు అలంపల్లి భువనేశ్వర్ దామరచర్ల కేంద్రంలో నోబుల్ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతూ మరోపక్క కరాటేలో శిక్షణ తీసుకొని గోల్డ్ మెడల్ సాధించి ప్రతిభను కనబరిచారు.
ఇంతటి ప్రతిభను కనబరిచిన బాలుడు భువనేశ్వరుని బుధవారం ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్ శాలువాతో సన్మానించి కుమారుని ప్రోత్సహిస్తున్న తల్లిదండ్రులను అభినందించారు. భవిష్యత్తులో ఉన్నతంగా ఎదగాలని సమాజానికి మంచి సేవలందించాలని కోరారు. అలాగే చదువుకున్న పాఠశాలకు తన తల్లిదండ్రులకు మంచి గుర్తింపు తెస్తూ భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగం సాధించి తమ గ్రామానికి సమాజానికి సేవ చేయాలని లక్ష్యం ఉన్నట్లు తెలిపారు.









