TG News : ముగ్గురు మంత్రులు అవుట్.. వారి స్థానంలో మరో ముగ్గురు..!

TG News : ముగ్గురు మంత్రులు అవుట్.. వారి స్థానంలో మరో ముగ్గురు..!
మన సాక్షి, తెలంగాణ బ్యూరో :
తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ముగ్గురు మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిగ్ షాక్ ఇచ్చారు. ఉత్తంకుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండ సురేఖలకు జిల్లా ఇన్చార్జి బాధితుల నుంచి తొలగించారు. వారి స్థానాల్లో మరో ముగ్గురికి జిల్లా ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు.
గడ్డం వివేక్ కు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు, అడ్డూరి లక్ష్మణ్ కు నలగొండ జిల్లా బాధ్యతలు, ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా వాకిటి శ్రీహరికి అప్పగించారు. అయితే గతంలో మెదక్ జిల్లా ఇన్చార్జిగా పనిచేసిన కొండా సురేఖ, ఖమ్మం జిల్లా ఇన్చార్జిగా పనిచేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కరీంనగర్ జిల్లా ఇన్చార్జిగా పనిచేసిన ఉత్తంకుమార్ రెడ్డి వీరికి ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వలేదు.
అదేవిధంగా మంత్రివర్గంలో ఉన్న కొందరికి జిల్లా ఇన్చార్జి బాధ్యతలను మార్పులు చేశారు. నల్లగొండ జిల్లా ఇన్చార్జిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కరీంనగర్ జిల్లా బాధ్యతలు అప్పగించారు. నిజామాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఉన్న జూపల్లికి ఆదిలాబాద్ జిల్లాకు, ఆదిలాబాద్ జిల్లా ఇన్చార్జిగా ఉన్న సీతక్కకు నిజామాబాద్ జిల్లాకు కేటాయించారు.
MOST READ :
-
Gold Price : ఆల్ టైం రికార్డ్.. ఇక గోల్డ్ కొనలేము..!
-
TG News : తెలంగాణలో పేలుడు కలకలం.. ఇద్దరికి గాయాలు..!
-
Miryalaguda : ఏరువాకలో దుక్కి దున్నిన ఎమ్మెల్యే..!
-
RDO : ఆర్డీఓ కీలక సూచన.. రేషన్ షాప్.. ఆర్డిఓ ఆకస్మిక తనిఖీ..!
-
Nalgonda : చదివింది ఏడవ తరగతి.. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ప్రాజెక్టు ఆఫీసర్.. రూ. 17 లక్షలతో పరార్..!









