Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District Collector : చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన జిల్లా కలెక్టర్..!

District Collector : చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించిన జిల్లా కలెక్టర్..!

సూర్యాపేట, మనసాక్షి:

దేశ భవిష్యత్ తరగతి గదుల్లో నిర్మితమవుతుందని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.
సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని కుడకుడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాలలను శుక్రవారం జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు.

ముందుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సందర్శించి అడ్మిషన్ రిజిస్టర్ లు, హాజరు రిజిస్టర్ లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు సమయపాలన పాటించాలని,ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ మొత్తంలో నూతనంగా విద్యార్థులు చేరేలా చూడాలని సూచించారు.

ప్రాథమిక పాఠశాల నుండి ఐదో తరగతి అయిపోయిన విద్యార్థులను వెంటనే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆరో తరగతిలో చేర్పించే విధంగా చూడాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటి వరకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 13 మంది నూతనంగా అడ్మిషన్ పొందారని ఉపాధ్యాయులు వివరించారు.

తదుపరి ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్న షేక్ ఉమేజా,షేక్ హైరసభ లకు అక్షరభాస్యం చేపించి ఆంగ్లంలో ఏ బి సి డి లు రాపిచ్చారు. తదుపరి రెండో తరగతిలోని విద్యార్థులకు బుక్స్,యూనిఫామ్ అందజేశారు. ప్రాధమిక స్థాయి నుండే మంచిగా చదువుకోని ఉన్నత స్థానాలకి చేరుకోవాలని ఆకాక్షించారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ హెచ్ ఎస్ ఇంచార్జి హెడ్ మాస్టర్ కవిత, ఉపాధ్యాయులు వెంకట నర్సమ్మ,ప్రతాప్ కుమార్, రాజు,ప్రాధమిక పాఠశాల హెడ్ మాస్టర్ శ్రీనివాస్ ఉపాధ్యాయులు విజయలక్ష్మి, అనురాధ,సత్తయ్య,కోటయ్య, రవీందర్ బాలచందర్ పాల్గొన్నారు.

MOST READ :

  1. Nalgonda : ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు మృతి.. చావు బతుకుల మధ్య తల్లి..!

  2. TG News : ముగ్గురు మంత్రులు అవుట్.. వారి స్థానంలో మరో ముగ్గురు..!

  3. Fertilizer : ఎరువుల డీలర్లకు జిల్లా వ్యవసాయ అధికారి సీరియస్ వార్నింగ్.. గోదాములలో ఎరువుల నిల్వల తనిఖీ..!

  4. Plane Crash : విమానం నుంచి నేను దూకలేదు.. నేను ఎలా బ్రతికాను..!

  5. Rythu Bharosa : రైతు భరోసా కు దరఖాస్తుల స్వీకరణ.. లేటెస్ట్ అప్డేట్..!

మరిన్ని వార్తలు