క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

Suryapet : జరిమానాలు ఎందుకు విదిస్తారో తెలుసా .. జిల్లా ఎస్పీ..! 

Suryapet : జరిమానాలు ఎందుకు విదిస్తారో తెలుసా .. జిల్లా ఎస్పీ..! 

సూర్యాపేట, మనసాక్షి

చట్టాలు ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేయబడ్డాయని, జరిమానా విధించడం అనేది మనలో మార్పు కోసమేనని జిల్లా ఎస్పీ కే నరసింహ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పబ్లిక్ క్లబ్ లో సూర్యాపేట పట్టణ ట్రాఫిక్ పోలీసులు, పట్టణ పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ మరియు మాదకద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ అవగాహన సదస్సు నందు జిల్లా ఎస్పీ నరసింహ , RTO సురేష్ రెడ్డి పాల్గొన్నారు. హాజరైన ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ మరియు డ్రగ్స్ నిర్మూలన, డ్రగ్స్ వినియోగం వల్ల సమాజంలో జరుగుతున్న అనర్ధాలు, యువతపై వాటి దుష్ప్రభావం మొదలగు అవగాహన కల్పించారు.

డ్రగ్స్ గంజాయి లాంటి మత్తు పదార్థాల జోలికి వెళ్ళమని ఆటోడ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయించారు. యాంటి డ్రగ్ సోల్జర్ సెల్ఫీ ప్లెక్సీ వద్ద ఆటో డ్రైవర్స్ సెల్ఫి ఫోటోలు దిగడం జరిగినది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని అన్నారు.

ఆటో డ్రైవర్స్ వాహనాలు కండిషన్లో ఉంచుకోవాలి వాహనాలు నడిపేటప్పుడు సౌండ్ బాక్స్లు వినియోగించవద్దు, తప్పుల నుండి మంచి పాఠాలు నేర్చుకుని జాగ్రత్తగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరు లైసెన్సు మరియు వాహన రిజిస్ట్రేషన్ కలిగి ఉండాలని , ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నిభందనలు ప్రకారం డ్రైవర్ దుస్తువులు ధరించి వాహనాలు నడపాలని కోరారు.

వ్యక్తిగత క్రమశిక్షణ వ్యక్తిగత ఆత్మాభిమానం ఉన్నప్పుడే ఇతర పట్ల మర్యాదగా ఉండగలమని అన్నారు. పాఠశాలలకు, కాలేజీలకు విద్యార్థులను తీసుకెళ్ళేటప్పుడు వారితో మర్యాదగా ఉండాలని,ప్రయాణికులతో మర్యాద తొ ప్రవర్తించాలని,ఆటోలో అక్రమ రవాణా చేయవద్దు అన్నారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణలో పోలీసులతో భాగస్వామ్యం కావాలని తెలిపారు.

మాదకద్రవ్యాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత. – ఎస్పి

డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాల నివారణ కోసం ప్రజల్లో అవగాహన కల్పించడం లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వము మరియు తెలంగాణ రాష్ట్ర పోలీస్ యాంటి నార్కోటిక్ బ్యూరో ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

మాదకద్రవ్యాల వల్ల జరిగే అనర్ధాలు, సమాజంలో జరిగే మంచి చెడులపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. మాదకద్రవ్యాల మత్తులో ఘోరమైన నేరాలకు కూడా వెనకాడడం లేదని తెలిపారు. ఇలాంటి మాదకద్రవ్యాలు మత్తు నుండి మన సమాజాన్ని మన పిల్లలను మనం రక్షించుకోవాలని సూచించారు.

మాదకద్రవ్యాలు వద్దు మంచి జీవితం ముద్దు అంటూ అవగాహన కల్పించి ఇలాంటి వాటిని వినియోగించిన రవాణా చేసిన, సరఫరా చేసిన కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం యాంటీ డ్రగ్స్ సోల్జర్ ఫ్లెక్సీ తో ఆటో డ్రైవర్లతో కలిసి ఎస్పీ ఆర్టీవో సెల్ఫీ ఫోటోలు దిగి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన సూర్యాపేట ట్రాఫిక్ ఎస్ఐ సాయిరాం, పట్టణ ఎస్సై ఆంజనేయులు ఈ కార్యక్రమానికి హాజరైన ఆటో డ్రైవర్లను ఎస్పీ అభినందించారు.

MOST READ NEWS : 

  1. District collector : రైతు భరోసా సంబరాలకు నల్గొండ జిల్లా రైతులు.. జెండా ఊపిన జిల్లా కలెక్టర్..!

  2. Transfers : తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం.. రాష్ట్రవ్యాప్తంగా భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు..!

  3. RDO : మాకు దారి చూపండి.. ఓడీఎఫ్ ఉద్యోగులు ఆవేదన..!

  4. District Collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలి..!

  5. Rythu : ఆ రైతులకు డబుల్ బోనాంజా.. ఎకౌంట్లో రూ.20 వేలు..!

మరిన్ని వార్తలు