జాతీయంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Amith Shah : 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్..!

Amith Shah : 2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్..!

ఆదివాసీల పేరుతో నక్సలైట్లు విధ్వంసం సృష్టిస్తున్నారు

నక్సలైట్లను అంతమందిస్తాం

కేంద్ర మంత్రి అమిత్ షా

మన సాక్షి, తెలంగాణ బ్యూరో :

2026 నాటికి మావోయిస్టు ముక్త్ భారత్ చేస్తామని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన కిసాన్ సమ్మేళనం సభలో మాట్లాడుతూ ఆయుధాలు పట్టుకున్న వాళ్ళతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవని స్పష్టం చేశారు. ఆదివాసీల పేరుతో మా మావోయిస్టులు విధ్వంసం సృష్టిస్తున్నారని అమిత్ షా పేర్కొన్నారు.

దశాబ్దాల కాలంగా నక్సలైట్లు ఆదివాసీల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. నక్సలిజాన్ని అంతం చేస్తామని ఆయన పేర్కొన్నారు. నక్సలైట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం లాగా కాదని ఆయుధాలు పట్టుకున్నోళ్లతో ఎట్టి పరిస్థితుల్లో చర్చలు ఉండవన్నారు. బీఆర్ఎస్ హయాంలో అంతా అవినీతి జరిగిందన్నారు. ధరణి, కాళేశ్వరం పథకాలతో కెసిఆర్ కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు.

MOST READ : 

  1. Nalgonda : జిల్లా ఎస్పీ కీలక సూచన.. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి..!

  2. Jio Star: యువ భారతదేశం కోసం వినూత్న కథనం.. ఏపిఓఎస్ 2025 వద్ద అలోక్ జైన్, కృష్ణన్ కుట్టి..!

  3. Hyderabad : హైదరాబాద్ లో తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..!

  4. ACB : సూర్యాపేట జిల్లాలో లంచం తీసుకుంటూ అడ్డంగా దొరికిన తహసిల్దార్ కార్యాలయ ఉద్యోగి..!

మరిన్ని వార్తలు