District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ సుడిగాలి పర్యటన..!
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ సుడిగాలి పర్యటన..!
నారాయణపేట టౌన్, మనసాక్షి :
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తేనే ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం, భరోసా కలుగుతాయని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్ అన్నారు. బుధవారం ఆయన పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. అర్బన్ హెల్త్ సెంటర్, అంగన్ వాడీ కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలను తనిఖీ చేశారు. స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో గల అర్బన్ హెల్త్ సెంటర్ కు వెళ్లి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు.
అర్బన్ హెల్త్ సెంటర్ కు రోజుకు ఎంతమంది ఓపి (అవుట్ పేషంట్స్,), ఐ పీ (ఇన్ పేషంట్స్) వస్తుంటారని అక్కడి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నరసింహారావు సగరిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి రికార్డులను, మందుల పంపిణీ రిజిస్టర్లను పరిశీలించారు. అవసరమైన మందులన్నీ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. సెంటర్ కి వచ్చిన రోగులతో మాట్లాడి వైద్య సేవలు ఎలా అందుతున్నాయని అడిగి తెలుసుకున్నారు.
పట్టణంలోని ధూల్ పేటలో గల అంగన్వాడి కేంద్రానికి ఆకస్మికంగా తనిఖీ చేశారు. అదనపు కలెక్టర్ అంగన్వాడి కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం, బోధన తీరును పరిశీలించారు. కేంద్రంలో మొత్తం ఎంతమంది చిన్నారులు ఉన్నారని అడిగి, చిన్నారుల ఎత్తు, బరువు ను చూశారు. కేంద్రానికి వచ్చిన ఆట పరికరాలు, బోధనా పరికరాలతో పాటు బియ్యాన్ని,కేంద్రానికి సంబంధించిన రికార్డులను పరిశీలించారు.
దూల్ పేట లోని ఓ అద్దె భవనంలో కొనసాగుతున్న హాజిఖాన్ పేట ఉర్దూ ప్రాథమిక పాఠశాలను అదనపు కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థుల సంఖ్య( 25 మంది) ను బట్టి హాజిఖాన్ పేటలోని ఆ ఉర్దూ పాఠశాలను ధూల్ పేటలోని అద్దె భవనంలో గత కొన్నేళ్ళ నుంచి కొనసాగిస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా ఆ భవనం కూలిపోయే స్థితికి చేరింది.
బుధవారం ఆ ఉర్దూ పాఠశాలను పరిశీలించిన అదనపు కలెక్టర్ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరిందని, వెంటనే ఆ ఉర్దూ పాఠశాలను కూరగాయల మార్కెట్ సమీపంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో గల ప్రాథమిక పాఠశాలలోకి మార్చాలని ఎంఈఓ బాలాజీని ఆదేశించారు.
MOST READ :
-
Nalgonda : అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి.. మంత్రుల ఉమ్మడి ప్రకటన..!
-
Pasha Mailaram : పాశ మైలారం ఘటనలో 36కు చేరిన మృతుల సంఖ్య.. మృతులకు కోటి రూపాయల పరిహారం ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి..!
-
Paddy Cultivation : బురద పొలాలు, వరినాట్లు లేవు.. ఇక అంతా పొడి దుక్కిలో వరి విత్తనాలు ఎద పెట్టడమే.. అది ఎలాగో తెలుసుకుందాం..!
-
Narayanpet : నేను చనిపోలేదు బతికే ఉన్నా.. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే లకు మొర..!









