Suryapet : పథకం ప్రకారం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పోలీసులు అదుపులో కొడుకు..!
Suryapet : పథకం ప్రకారం తండ్రిని హత్య చేసిన కొడుకు.. పోలీసులు అదుపులో కొడుకు..!
సూర్యాపేట, మనసాక్షి
తండ్రి కుమారుల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న భూ వివాదం కారణంగా తండ్రిని హత్య చేసిన కొడుకును పోలీసులు అదుపులోకి తీసుకొని రిమాండ్ తరలించారు. ఈ సందర్భంగా శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ నరసింహ వివరాలు వెల్లడించారు.
ఈనెల 2 తేదీన మోతె మండలం నాగయ్యగూడెం గ్రామానికి చెందిన నిమ్మరబోయిన వెంకన్న (60 ) అనే వ్యక్తిని విమలాపురం గ్రామ శివారులో అతని కుమారుడు నిమ్మరబోయిన గంగయ్య కాపుగాచి గొడ్డలితో దాడి చేసి హత్య చేశాడు. భూమి సంబంధిత తగాదా విషయమై తండ్రి కుమారులకు మధ్య గత కొద్ది నెలలుగా వివాదం జరుగుతుందని.. భూ వివాదం కారణంగానే పథకం ప్రకారం తండ్రిని హత్య చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలిపారు.
ఇట్టి కేసు దర్యాప్తులో భాగంగా నమ్మదగిన సమాచారంపై ఈరోజు ఉదయం 10 గంటల సమయంలో మామిళ్లగూడెం ఎక్స్ రోడ్డు వద్ద హత్యకు పాల్పడిన నిందితుడు నిమ్మరబోయిన గంగయ్యను మోతే ఎస్సై రాఘవేందర్ రెడ్డి తన సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకున్నారు. ఇటు కేసు వివరాలు వెల్లడించి నిందితుడిని రిమైండర్ తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
MOST READ :
-
Miryalaguda : వ్యభిచార గృహంపై పోలీసుల దాడి.. ఇద్దరు విటులు, ఆరుగురు మహిళలు అరెస్ట్..!
-
Murder : తండ్రిని హత్య చేసిన కొడుకు.. ఎందుకంటే..!
-
District Collector : రాత్రి వేళ గురుకుల పాఠశాలలో జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ..!
-
District Additional Collector : జిల్లా అదనపు కలెక్టర్ సుడిగాలి పర్యటన..!
-
Holidays : విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వరుసగా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం..!









