క్రైంBreaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. వారి ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి..!

Nalgonda : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. వారి ఫిర్యాదుల పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలి..!

నల్లగొండ, మన సాక్షి:

బాధితులకు సత్వర న్యాయం జరిగేలా పోలీస్ అధికారులు పనిచేయాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రీవెన్స్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 68 మంది అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి ఫిర్యాదులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ప్రజలకు పోలీస్ శాఖను మరింత చేరువ చేయడం లక్ష్యంగా ప్రజా సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తున్నామన్నారు. బాధితుల సమస్యలు తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చిన ఫిర్యాదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించి సంబంధిత ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో పరిశీలించాలన్నారు. బాధితులకు న్యాయం జరిగే విధంగా చూడడం జరుగుతుందని తెలిపారు.ఎవరైనా చట్ట వ్యతిరేకమైన చర్యలు చేస్తూ శాంతి భద్రతలకు భంగం కలిగించే వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని ఎస్పీ సూచించారు.

ఈ వార్తలు కూడా చదవండి : 

  1. TG News : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. వారికి భారీ గుడ్ న్యూస్..!

  2. TG News : తెలంగాణలో మరో కొత్త పథకం.. వారి ఖాతాలలో రూ.6 వేలు..

  3. CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన.. వారికి 60 సీట్లు ఇస్తా, గెలిపిస్తా..!

  4. Miryalaguda : రేపటి నుంచి మూడు రోజులపాటు మిర్యాలగూడ న్యూరో లో మెగా ఉచిత వైద్య శిబిరం..!

  5. Nagarjuna Sagar : పెరుగుతున్న నాగార్జునసాగర్ జలాశ నీటిమట్టం..!

మరిన్ని వార్తలు