District Collector : విద్యార్థుల ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..!

District Collector : విద్యార్థుల ఇంటికి వెళ్లిన జిల్లా కలెక్టర్.. ఎందుకో తెలుసా..!
కొల్చారం, మన సాక్షి:
పాఠశాలకు రాని విద్యార్థుల ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్న మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.పాఠశాలకు ఎందుకు రావడం లేదని ఆరా తీశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు పాఠశాల పైనే ఆధారపడి ఉందని విద్యార్థులు డుమ్మ కొట్టకుండా పాఠశాలకు రావాలి, విద్యార్థులను ప్రతిరోజు పాఠశాలకు పంపాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే.
మెదక్ జిల్లా కొల్చారం మండలం దేశ్య తండా ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు పట్టికను పరిశీలించి పాఠశాలకు రాని విద్యార్థుల గురించి ఉపాధ్యాయులను అడిగి ఆరా తీశారు.
వరుసగా రెండు మూడు రోజులుగా పాఠశాలలకు రాని విద్యార్థుల ఇల్లు ఇల్లు తిరిగి పాఠశాలకు విద్యార్థులను ఎందుకు పంపడం లేదని విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నరూ. పాఠశాలకు ఒక్కరోజు డుమ్మా కొట్టకుండా ప్రతిరోజు విద్యార్థులు పాఠశాలకు రావాలని సూచించారు.
ప్రతిరోజు పాఠశాలకు పంపించే బాధ్యత తల్లిదండ్రులదే అన్నారు.పాఠశాల ప్రారంభమై నెల రోజులు గడిచిందన్నారు. ఏ ఒక్కరోజు కూడా విద్యార్థులు ఆబ్సెంట్ లేకుండా చూడాలన్నారు. ప్రభుత్వం పాఠశాలలో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తుందన్నారు. అనుభవజ్ఞులైన టీచర్లు ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారన్నారు.
వ్యవసాయ పనులని ,పండుగలని ఏ ఇతర పనుల కారణంగా పిల్లలను తీసుకువెళ్లద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల బంగారు భవిష్యత్తు స్కూల్ పైనే ఆధారపడి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Miryalaguda : ఎమ్మెల్యే బి ఎల్ ఆర్ కీలక ప్రకటన.. మిర్యాలగూడలో ఇకపై వారంలో రెండు రోజులు ప్రజా వాణి..!
-
PMSBY : రూ.20 చెల్లిస్తే ఏడాదికి రెండు లక్షల ప్రధానమంత్రి సురక్ష ప్రమాద బీమా.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి..!
-
Social Media: రీల్స్‌కు బానిసయ్యారా.. ఈజీగా వదిలించుకోండిలా..!
-
UPI : ఫోన్ పే, గూగుల్ పే లో బ్యాలెన్స్ చెక్ చేస్తున్నారా.. అయితే ఇది తెలుసుకోవాల్సిందే..!
-
DMart : డి మార్ట్ లో వారానికి ఆ రెండు రోజులు బంపర్ ఆఫర్స్.. సగం కంటే తక్కువ ధరలకే..!









