జిల్లా వార్తలుBreaking Newsఖమ్మం జిల్లాతెలంగాణవ్యవసాయం

Nano Urea : నానో యూరియా వాడకం ఎలా.. రైతులకు వ్యవసాయ అధికారుల సలహాలు.!

Nano Urea : నానో యూరియా వాడకం ఎలా.. రైతులకు వ్యవసాయ అధికారుల సలహాలు.!

నేలకొండపల్లి, మన సాక్షి :

నానో యూరియా వలన రైతులకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని కూసుమంచి వ్యవసాయ సహాయ సంచాలకులు యం.సతీష్ సూచించారు. మండలం లోని మంగాపురంతండా లో శనివారం రైతులతో ప్రత్యేక సమావేశం ను నిర్వహించారు. ఈ సందర్భంగా* ఆయన మాట్లాడారు..

నానో యూరియా పై రైతులకు అవగాహాన కల్పించాలని సూచించారు. నానో యూరియా వలన రైతులు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. భూమి ని కాపాడుకోవచ్చునని అన్నారు. నానో పద్దతి ద్వారా పిచికారి చేస్తే అనేక ప్రయోజనాలు ఉన్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి వస్తుందని అన్నారు. నేల సారాన్ని కాపాడుకోవచ్చునని అన్నారు.

రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలని సూచించారు. పంటలకు సమయానికి అవసరమైన పోషకాలు అందించాలని సూచించారు. పర్యావరణం కు మేలు చేస్తుందని అన్నారు. నానో యూరియా, నానో డీఏపీ వాడకం పద్ధతులు లాభాలు గురించి తెలుసుకోవాలని సూచించారు.

రైతులు సుస్థిర వ్యవసాయం వైపు ముందుకు సాగేందుకు ఉపయోగపడుతుందని పేర్కోన్నారు. ఈ కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి యం.రాధ, ఏఈవో అవినాష్. రైతులు తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Big Alert : తెలంగాణకు భారీ వర్ష సూచన.. నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్..!

  2. TG News : రేషన్ కార్డుదారులకు శుభవార్త.. సెప్టెంబర్ నుంచి సన్న బియ్యం అలా పంపిణీ..!

  3. Phone Pe, Gpay : ఫోన్ పే, గూగుల్ పే వాడేవారికి బిగ్ అలర్ట్.. ఇకపై ఆ సేవలు బంద్..!

  4. District collector : ఇండియన్ సైన్ లాంగ్వేజ్ లో జాతీయ గీతం.. ఆలపించిన జిల్లా కలెక్టర్..!

మరిన్ని వార్తలు