Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనిజామాబాద్

Urea : యూరియా కొరత లేదు.. ఎరువుల గోదామును పరిశీలించిన జిల్లా సహకార అధికారి..!

Urea : యూరియా కొరత లేదు.. ఎరువుల గోదామును పరిశీలించిన జిల్లా సహకార అధికారి..!

ఆర్మూర్, మన సాక్షి :

నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎరువుల గోదాంను జిల్లా సహకార అధికారి శ్రీనివాసరావు మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత సమస్య ఏమీ లేదని, అవసరమైనంత మేరకు ఎరువులు అందుబాటులో ఉన్నాయని స్పష్టం చేశారు.

రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని తగినంత స్టాక్ గోదాంలో ఇప్పటికే నిల్వ ఉంచినట్లు తెలిపారు. క్రమపద్ధతిలో ఎరువులు పంపిణీ జరుగుతాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం వైస్ చైర్మన్ చేపూర్ రాజేశ్వర్, సెక్రటరీ మల్లేష్, సిబ్బంది ముత్యం, సురేష్, సీతగంగారాం, పలువురు రైతులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. District SP : జిల్లా ఎస్పీ కీలక ఆదేశాలు.. పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ..!

  2. Karimnagar : లీజు రద్దు చేయాలి.. దేవాలయ భూములను కాకాపాడాలని జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు..!

  3. Open University : అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అడ్మిషన్స్.. ధరఖాస్తులకు చివరి గడువు ఎప్పుడంటే..!

  4. Nano Urea : నానో యూరియా వాడకం ఎలా.. రైతులకు వ్యవసాయ అధికారుల సలహాలు.!

మరిన్ని వార్తలు