Breaking Newsఆంధ్రప్రదేశ్విద్య

Alumini : పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

Alumini : పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక..!

రామసముద్రం, మన సాక్షి :

అన్నమయ్య జిల్లా రామసముద్రం మండల కేంద్రంలోని కేసీ పల్లె జిల్లా ఉన్నత పాఠశాలలో 2014-15 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ కలయిక కార్యక్రమంను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు విద్య నేర్పిన ఉపాధ్యాయులను సత్కరించి, జ్ఞాపికలను అందజేశారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకొని వారి వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

ఉపాధ్యాయులు మాట్లాడుతూ మీకు విద్యాబుద్ధులు నేర్పిన మీరు ఎంతో మంది ఇప్పుడు ఉన్నత శిఖరాలకు చేరుకున్నారని చాలా ఆనందంగా ఉందన్నారు. మీకు విద్యా బుద్ధులు నేర్పిన మాకు ఇన్ని సంవత్సరాలు గుర్తు పెట్టు కుని మాకు సత్కారం చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కేశవ రెడ్డి,చంద్రశేఖర్ అధ్యాపకులు పూర్వ విద్యార్థులు పాఠశాలకు నీటి పరిశుద్ధ యత్రం, క్రీడా సామాగ్రి వితరణ చేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్నా ఉపాధ్యాయులు చంద్రశేఖర్,రమణారెడ్డి, లీలావతమ్మ, శైలజకుమారి, బారతి, వేణు, మాదవి, చంద్రశేఖర్, రెడ్డెప్ప, శారధమ్మ, వెంకటరత్నమ్మ, దామోదర్ పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు