Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండ

Nalgonda : కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య, కుటుంబ సభ్యుల ధర్నా..!

Nalgonda : కాపురానికి తీసుకెళ్లడం లేదని భర్త ఇంటి ముందు భార్య, కుటుంబ సభ్యుల ధర్నా..!

నల్లగొండ, మనసాక్షి :

భర్త తనను కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ మంగళవారం భార్య భర్త ఇంటి ముందు ధర్నా చేసిన సంఘటన చోటుచేసుకుంది. తెలిసిన వివరాల ప్రకారం త్రిపురారం మండలానికి చెందిన లగడాపురం శ్రీ బిందు తన కుటుంబ సభ్యులతో నల్గొండపట్టణంలోని షేర్ బంగ్లా హనుమాన్ నగర్లోని తన భర్త లగడాపుర మహేందర్ ఇంటి ముందు ధర్నా నిర్వహించి ఆందోళన చేసింది. పట్టణానికి చెందిన లగడ పురం మహేంద్ర తో తనకు 11 నెలల క్రితం వివాహం జరిగిందని వివాహ సమయంలో 20 తులాల బంగారం రెండు లక్షల సామాన్లు నాలుగు లక్షల కట్నం ఇచ్చారని తెలిపారు.

తన భర్త ఐసిఐసి బ్యాంకులో వివిధ రుణాలు ఇప్పించే ఏజెంట్గా పని చేస్తున్నాడని గత ఫిబ్రవరిలో తన భర్తకు జీతం రాగా జీతం ఎంత అని అడిగినందుకు తనపై దుర్భాషలాడి తనను జీతం అడుగుతావా నువ్వు వద్దు నీ సంసారం వద్దు అంటూ కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపించారు.

తన ఆడబిడ్డ ఆమె భర్త ఇద్దరు తమ దగ్గరే ఉంటారని తమ ఆడబిడ్డ పంచాయత్ కార్యదర్శి పనిచేస్తూ మా సంసారంలో చిచ్చు పెడుతూ తమను కాపురం చేయనీయడం లేదని ఆరోపించారు. గతంలో తమ కుల పెద్దలు పంచాయతీ నిర్వహించి పంచాయతీ తీర్మానం చేసినా దానికి ఒప్పుకోకుండా మా ఆడబిడ్డ ఆమె భర్త తండ్రి ఒత్తిడి మేరకు తన భర్త పంచాయతీకి రావడం లేదని ఆరోపించింది. కాగా సమాచారం అందుకున్న పోలీసులు ధర్నా దగ్గరకు వచ్చి వారికి సమాధానపరిచి ధర్నాను విరమింపజేశారు.

MOST READ : 

  1. Choutuppal : జాతీయస్థాయి కుంగ్ ఫూ, కరాటే పోటీలలో కృష్ణవేణి విద్యార్థుల ప్రతిభ..!

  2. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

  3. పేకాట స్ధావరం పై పోలీసులు దాడి.. నలుగురు పై కేసు నమోదు..!

  4. District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

మరిన్ని వార్తలు