తెలంగాణBreaking Newsజిల్లా వార్తలుపండుగలు

Nalgonda : డి.ఎస్.పి శివరాం రెడ్డి కీలక సూచన.. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి..! 

Nalgonda : డి.ఎస్.పి శివరాం రెడ్డి కీలక సూచన.. శాంతియుతంగా గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి..! 

నల్లగొండ, మన సాక్షి:

శాంతియుతంగా గణేశ్ ఉత్సవాలు జరుపుకోవాలని డీఎస్పీ శివరాం రెడ్డి సూచించారు. బుధవారం జగిని టెక్స్ టైల్, ఆలివ్ డెంటల్ కేర్ వారి ఆధ్వర్యంలో దాదాపు 1500 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేసి మాట్లాడారు. మట్టి వినాయకులను పూజించి.. పర్యావరణాన్ని కాపాడుదామన్నారు.

దాదాపు 15 సంవత్సరాలుగా సేవలందిస్తూ పర్యావరణ రక్షణ ధ్యేయంగా మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.

అసాంఘిక శక్తుల పై నిరంతరం పోలీసు వారి నిఘా ఉంటుందన్నారు. ఉత్సవాలకు డీజే అనుమతి లేదని,శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

MOST READ : 

  1. Agricultural Tools : సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు.. దరఖాస్తు ఆహ్వానం..!

  2. Nalgonda : నల్గొండ కోర్టు సంచలన తీర్పు.. తిప్పర్తి ఘటన కేసులో 50 ఏళ్ల జైలు, 80 వేల జరిమానా..!

  3. Narayanpet : ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ..!

  4. School Building : నిధులు లేవు.. గదులు లేవు.. చదువులు సాగేదెలా..!

మరిన్ని వార్తలు