తెలంగాణBreaking Newsకామారెడ్డి జిల్లాజిల్లా వార్తలు

Heavy Rain : భారీ వర్షాలు.. రేపు ఆ జిల్లాలో పాఠశాలకు సెలవు..!

Heavy Rain : భారీ వర్షాలు.. రేపు ఆ జిల్లాలో పాఠశాలకు సెలవు..!

మన సాక్షి, కామారెడ్డి

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెరువులు అలుగులు పోయడంతో పాటు కామారెడ్డి జాతీయ రహదారిపై వరద నీరు ప్రవాహం వల్ల హైవే మూసేశారు. అదే విధంగా రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లను రద్దు చేశారు. దాంతో కామారెడ్డి జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు జిల్లా కలెక్టర్ రేపు (గురువారం) సెలవు ప్రకటించారు.

కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలో భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కామారెడ్డిలో పట్టణంలో లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. జిల్లాలో అత్యధికంగా 31.93 సెంటీమీటర్ల వర్షం నమోదయింది. మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లా కలెక్టర్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

MOST READ :

  1. Amazon : అమెజాన్ స్కాలర్‌షిప్‌తో తెలంగాణ యువతి విజయం.. మరో 500 మందికి ఆర్థిక చేయూత..!

  2. Miryalaguda : జాతీయ కుటుంబ ప్రయోజన పథకానికి మీరు అర్హులైతే.. వెంటనే ధరఖాస్తు చేసుకోవాలి..!

  3. NMDC : హైదరాబాద్ మారథాన్ 2025కు అధికారిక భాగస్వామిగా తమ మారథాన్ పోర్ట్‌ఫోలియోను విస్తరించిన ఏసిక్స్..!

  4. District collector : జాతీయ కుటుంబ ప్రయోజనం పథకానికి దరఖాస్తుల ఆహ్వానం.. మీరు అర్హులు అయితే దరఖాస్తు చేసుకోండి..!

  5. Narayanpet : విజిలెన్స్ అధికారులు ఆకస్మిక తనిఖీ..!

మరిన్ని వార్తలు