Nalgonda : యూరియా కోసం ధర్నా, అరెస్ట్..!
Nalgonda : యూరియా కోసం ధర్నా, అరెస్ట్..!
గుర్రంపోడు, మన సాక్షి :
తెలంగాణ రాష్ట్రంలో రైతులకు సరిపడా యూరియాను అందించలేని అసమర్ధ ప్రభుత్వం కాంగ్రెస్‌ది అని, ఈ ప్రభుత్వానికి రైతుల ఉసురు తగులుతుందని, రైతులు యూరియా కోసం రోడ్లమీదికి వచ్చినా దొరకడం లేదని బుధవారం గుర్రంపోడు మండలంలోని నల్గొండ- దేవరకొండ రహదారిపై బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు నాగులవంచ తిరుపతిరావు ఆధ్వర్యంలో యూరియా కోసం ధర్నా చేపట్టారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేశారు.
ఈ ధర్నాలో రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రభుత్వ తీరుపై మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి రోజు రైతులు యూరియా కోసం రోడ్లపైకి వస్తున్నా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం స్పందించడం లేదన్నారు ప్రతిరోజు తెల్లవారుజామునే రైతులు క్యూలో నిలబడినా యూరియా దొరకడం లేదన్నారు.
రైతు వ్యతిరేక రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం త్వరలోనే రైతులు చెబుతారని అన్నారు. యూరియా, విత్తనాల సరఫరాలో రేవంత్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నదని , తమపై ఎన్ని కేసులు పెట్టినా బయపడమని, రైతుల పక్షాన పోరాటాన్ని ఆపబోమన్నారు.
అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని నాగులవంచ తిరుపతిరావు అన్నారు. ధర్నా చేసే విషయం స్థానిక ఎస్సై పసుపులేటి మధుకు సమాచారం అందడంతో ధర్నా చేసే నాయకులను చదరగొట్టి , అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :









