Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసూర్యాపేట జిల్లా

District collector : జిల్లా కలెక్టర్ భూ భారతి ఆర్టీలపై కీలక ప్రకటన.. ఆర్డీవో, తహసిల్దార్లకు ఆదేశాలు..!

District collector : జిల్లా కలెక్టర్ భూ భారతి ఆర్టీలపై కీలక ప్రకటన.. ఆర్డీవో, తహసిల్దార్లకు ఆదేశాలు..!

సూర్యాపేట, మనసాక్షి :

భూ భారతి చట్టం అమలులో భాగంగా నిర్వహించిన రెవిన్యూ సదస్సు లో వచ్చిన అర్జిలను వేగవంతంగా పరిష్కరించడం ద్వారా రెవెన్యూ సేవలు ప్రజల చెంతకు వెళ్లేలా చూడాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

బుధవారం ఆయన ఆర్డీఓ లతో, తహసీల్దార్లతో వెబ్ ఎక్స్ ద్వారా భూ భారతి, ప్రజవాణి ఆర్జీలు, ఇందిరమ్మ ఇండ్లకి ఇసుక సరఫరా, మీసేవ సర్టిపికెట్ల పెండింగ్ పై సమావేశం నిర్వహించారు. భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన ఆర్జీలపై రెవెన్యూ డివిజనల్ వారీగా సమీక్షిస్తూ చాలా రోజులుగా పరిష్కారం కానీ భూ సమస్యల కై భూ భారతి చట్టం రూపొందిచటం జరిగిందని, ఒకవేళ తిరస్కరణకు గురైన ఆర్జిలకు సరైన కారణాలతో వివరించాలని సూచించారు.

ఆర్ఎస్ ఆర్ అదనపు నమోదులు ఉన్న సర్వే నెంబర్లను గ్రామాల వారీగా గుర్తించి, రికార్డులు పరిశీలించి,క్షేత్రస్థాయి పర్యటన చేసి భూమిలేని రైతులకు నోటీసులు జారీ చేసి తొలగించాలని అదేవిధంగా ఎవరికైతే ఆన్లైన్లో నమోదు కావాలో వారి పేర్లు నమోదు చేయాలని సూచించారు .

రాష్ట్ర స్థాయి ప్రజావాణి, జిల్లా ప్రజావాణి లలో వచ్చిన దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని అన్నారు. ఎక్కడో మారూముల ప్రాంతం నుండి జిల్లా కేంద్రానికి వచ్చి వారి సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో ఆశతో వచ్చి అర్జీలను సమర్పిస్తున్నారని అట్టి నమ్మకాన్ని వమ్ము చేయకుండా రెవిన్యూ అధికారులు రైతులకు సహాయపడే విధంగా విధులు నిర్వహించాలని సూచించారు.

స్లాట్ బుక్ చేసిన లబ్ధిదారులు కి ఆ రోజే రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని ఒకవేళ తహసిల్దార్ అందుబాటులో లేకపోతే డిప్యూటీ తహసీల్దార్ కు ఇన్చార్జి ఇవ్వాలని, తహసిల్దార్ కార్యాలయంలో రోజువారి రిజిస్ట్రేషన్లకు సంబంధించి ఒక రిజిస్టర్ నిర్వహించాలని, ఆయన గానీ,ఆర్డీవోలు గాని తనిఖీలు చేసినప్పుడు అట్టి రిజిస్టర్ ని పరిశీలించడం జరుగుతుందని అన్నారు.
పలు ప్రభుత్వ అభివృద్ధి పనులకు కావలసిన భూసేకరణ పనులు త్వరగా పూర్తి చేయాలని,అలాగే హైకోర్టు సివిల్ కోర్టు లోకాయుక్త హెచ్ఆర్సి లకు సంబంధించిన కోర్టు కేసు లను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

మీసేవ ద్వారా చేసుకున్న ఆదాయ, కుల ధ్రువీకరణ, రెసిడెన్సి లాంటి సర్టిఫికెట్లను పెండింగ్ ఉంచకుండా ఎప్పటికప్పుడే ఆమోదం తెలపాలని సూచించారు. పేదవాని సొంతింటి కల నెరవేర్చేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిందని వాటి నిర్మాణం కొరకు ఇసుక ఉచితంగా ప్రభుత్వం అందిస్తుంది కాబట్టి రెవెన్యూ అధికారులు ప్రత్యేక చొరవ తీసుకొని ఎంపీడీవోలను సమన్వయం చేసుకుంటూ, పంచాయతీ సెక్రెటరీ ల ద్వారా గ్రామాల వారీగా సమాచారం తీసుకొని ప్రతి ఇంటికి ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు ఆదేశించారు.

MOST READ : 

  1. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి.. లభించని మరో ముగ్గురు చిన్నారుల ఆచూకీ..!

  2. Godavarikhani : గంజాయి అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తులను చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు..!

  3. TG News : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు ఎమ్మెల్యే చిట్టెం పర్ణికరెడ్డి వినతి..!

  4. Suryapet : పెన్ పహాడ్ ఎంపీఓ గా బాధ్యతలు స్వీకరించిన బీస్ రాజేశ్వర్.. ఎవరో తెలుసా..!

మరిన్ని వార్తలు