Tasildar : ఉద్యోగిని పై లైంగిక వేధింపులు.. తహసిల్దార్ అరెస్ట్..!

Tasildar : ఉద్యోగిని పై లైంగిక వేధింపులు.. తహసిల్దార్ అరెస్ట్..!
జగిత్యాల, మన సాక్షి :
ప్రభుత్వ మహిళ ఉద్యోగులకు కూడా రక్షణ లేకుండా పోయింది. ఉన్నతాధికారే లైంగిక వేధింపులకు పాల్పడిన సంఘటన జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. ఉద్యోగిని పై లైంగిక వేధింపులకు గురిచేసిన జగిత్యాల జిల్లా పెగడపల్లి తాసిల్దార్ రవీందర్ పై పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు.
జగిత్యాల పట్టణ సిఐ కరుణాకర్ తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని పెగడపల్లి తాసిల్దార్ రవీందర్ జగిత్యాల పట్టణంలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే విధులు నిర్వహించారు. ఆ సమయంలో అతనితో కలిసి పని చేసిన మహిళా ఉద్యోగికి వాట్సాప్ లో అసభ్యకరంగా సందేశాలు పంపడంతో పాటు ఆమెతో దురుసుగా ప్రవర్తించాడు. కాగా తనను లైంగికంగా వేధించాడని సదరు మహిళ శుక్రవారం పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.
దాంతో కేసు నమోదు చేసిన పోలీసులు తాసిల్దార్ రవీందర్ ను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. ఈ కేసులో ఫిర్యాదును వాపస్ తీసుకోవాలని జగిత్యాలకు చెందిన ఓ తాసిల్దార్ మధ్యవర్తిగా వ్యవహరించాడు. కాగా మహిళా ఉద్యోగి కేసు వాపస్ తీసుకోకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
MOST READ :
-
Crypto currency : నకిలీ క్రిప్టో కరెన్సీ.. మాజీ కార్పొరేటర్ అరెస్ట్..!
-
BC Reservations : 42 శాతం బీసీ రిజర్వేషన్లకు గవర్నర్ ఆమోదం.. ఇక స్థానిక ఎన్నికలకు లైన్ క్లియర్..!
-
Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!
-
Karimnagar : నిజాయితీ చాటుకున్న ఆటో డ్రైవర్.. అభినందించిన సీపీ..!
-
Nalgonda : అధిక ధరలకు యూరియా విక్రయం.. అధికారుల తనిఖీ.. పోలీసులు కేసు నమోదు..!









