Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణసంగారెడ్డి జిల్లా
Nano Urea : నానో యూరియా వాడకంతో అధిక లాభాలు..!

Nano Urea : నానో యూరియా వాడకంతో అధిక లాభాలు..!
కంగ్టి, మన సాక్షి:
సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల తడ్కల్ గ్రామంలో బుధవారం రైతులకు నానో యూరియా వాడకంపై నారాయణఖేడ్ డివిజన్ వ్యవసాయ శాఖ ఏడిఏ నూతన్ కుమార్, మండల వ్యవసాధికారి హరీష్ పవర్ తో కలిసి రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం ప్రయోజనాలు వినియోగించే విధానాలు వివరించారు.
ఈ సందర్భంగా ఎడిఏ మాట్లాడుతూ.. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ ప్రవేశించినప్పటి నుంచి రకరకాల ఆవిష్కరణలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే అద్భుతమైన ఆవిష్కరణ ఈ నానో యూరియా, దీనివల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని రైతులకు అవగాహన కల్పించారు.
నానో యూరియా మొక్కలలో పచ్చదనం చురుకైన పెరుగుదల పంట అభివృద్ధికి దోహదపడుతందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.
MOST READ :
-
Sub Collector : మిర్యాలగూడ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.. ఇసుక ట్రాక్టర్ సీజ్..!
-
District collector : జిల్లా కలెక్టర్ కీలక ఆదేశాలు.. వారి దరఖాస్తులకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి..!
-
ACB : విద్యుత్ ఏడిఈ అంబేద్కర్ ఇంట్లో ఏసీబీ సోదాలు.. రెండు కోట్లు గుర్తింపు..!
-
Godavarikhani : డిగ్రీ చదువుతూ.. జల్సాలకు అలవాటు పడి.. పోలీసులకు చిక్కాడు ఇలా..!









