Breaking Newsజిల్లా వార్తలుతెలంగాణనల్గొండరాజకీయం

Miryalaguda : యూరియా కోసం తొక్కిసలాటలో మహిళ మృతి.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి..!

Miryalaguda : యూరియా కోసం తొక్కిసలాటలో మహిళ మృతి.. ప్రభుత్వమే బాధ్యత వహించాలి..!

అడవిదేవులపల్లి మన సాక్షి:

ఈనెల 11వ తేదీన గొనియా తండా గ్రామానికి చెందిన పాతులోతు దస్సి రైతు వేదిక దగ్గర యూరియా కట్టల కోసం క్యూ లైన్ లో నిలబడగా జరిగిన తొక్కిసలాటలో మహిళ రైతు గాయాల పాలై మృతి చెందిన పాతులోతు దస్సి కుటుంబానికి తక్షణమే ప్రభుత్వం 50 లక్షల నష్టపరిహారం కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని, అడవిదేవులపల్లి మాజీ ఎంపీపీ ధనావత్ బాలాజీ నాయక్, స్థానిక మాజీ సర్పంచ్ కొత్త మర్రెడ్డి, బిఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీను నాయక్,ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని స్థానిక మాజీ సర్పంచ్ కొత్త మర్రెడ్డి నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా కోసం ప్రతిరోజు రైతులు గంటల తరబడి తమతమ వ్యవసాయ పనులు వదులుకొని వచ్చి పంటలను బతికించుకోవాలని ఆరాటంతో యూరియా కేంద్రాల వద్ద క్యూలో నిలబడుతుంటే రైతుల గోస ప్రభుత్వానికి కనబడటం లేదా అని అన్నారు.

అలాగే ఒక మహిళ రైతు యూరియా కట్టల కోసం వెళ్లి తొక్కిసలాటలో మృతి చెందితే, మహిళ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ స్థానిక ప్రజాప్రతినిధులు పరామర్శించకుండా ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం హాస్యాస్పదమని అన్నారు. బిఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతుకి యూరియా కొరత లేకుండా చేసామన్నారు.

ఇప్పటికైనా తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా, మండల కేంద్రంలోనే కాకుండా ప్రతి గ్రామాలలో కూడా యూరియా సరఫరా కౌంటర్లను ఏర్పాటు చేయాలని అన్నారు. అధికార పార్టీ నాయకులే రైతులా మిగతావారు రైతులు కాదా అని అన్నారు.గురువారం బాల్నేపల్లి గ్రామంలో అర్ధరాత్రి సమయంలో ఒక లారీ యూరియాను తమ తమ నివాసాలకు తరలింపు చేసుకున్నారని ఆరోపించారు.

అడవిదేవులపల్లి మండలంలోని పక్క గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్లు ముగ్గులు పోసి పునాదులు వేస్తుంటే, అడవిదేవులపల్లి గ్రామంలో ఇంతవరకు ముగ్గులు పోసిన దాఖలాలు లేవని అన్నారు. ఇందిరమ్మ ఇండ్ల శాంక్షన్ లిస్టులో పేర్లు ఉన్నాయని కొంతమంది లబ్ధిదారులు ఉంటున్న ఇండ్లను కూలగొట్టుకొని అవస్థలు పడుతున్నారని అన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి కుర్ర సేవ్య నాయక్, మాజీ సర్పంచులు కుర్ర బీమా నాయక్,పెరుమాళ్ళ శ్రీనివాస్, స్వామి నాయక్,పిల్లి సింగన్న, మిర్యాలగూడ మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి వెంకటేశ్వర్లు, ఉప సర్పంచ్ కేశబోయిన కొండలు, మాజీ కో ఆప్షన్ సభ్యుడు షేక్ బాబు జాని, గ్రామ శాఖ అధ్యక్షుడు పచ్చిపాల లింగయ్య, నాగరాజు, పుల్లారావు, తదితరులు పాల్గొన్నారు.

MOST READ : 

  1. Miryalaguda : నల్గొండ జిల్లాలో రూ.200 కోట్ల యూరియా కుంభకోణం.. అక్రమాలకు హబ్ గా మిర్యాలగూడ..!

  2. District collector : జిల్లా కలెక్టర్ సంచలన నిర్ణయం.. దీర్ఘకాల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారానికి శ్రీకారం..!

  3. District collector : జిల్లా కలెక్టర్ కీలక నిర్ణయం.. 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను కేటాయింపుకు తీర్మానం..!

  4. Bumper Offers : ఐఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్.. క్రోమాలో అద్భుతమైన ఆఫర్లు..! 

మరిన్ని వార్తలు