Nizamabad : మక్క కొనుగోలు కేంద్రం లేక దళారుల దోపిడీ..!

Nizamabad : మక్క కొనుగోలు కేంద్రం లేక దళారుల దోపిడీ..!
భీంగల్, మన సాక్షి:
భీంగల్ మండలం బడా భీంగల్ లో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవనికి వెళ్తున్న సమయంలో రోడ్డు పై అరబోసిన మక్కలను ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. అక్కడే ఉన్న రైతులతో వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు పెట్టక ప్రవేట్ వ్యాపరులకు తక్కువ ధరకు మక్కలు అమ్ముకోవడం వలన నష్టపోతున్నమని రైతులు ఎమ్మెల్యే తో తమ ఆవేదన వెలిబుచ్చారు.
ఈ సందర్బంగా ప్రభుత్వం వెంటనే మక్కల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి క్వింటాలుకు 2400 మద్దతు ధర తో పాటు ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం అదనంగా 400 రూపాయలు ఇచ్చి 2800 లకు కొనుగోలు చేయాలనీ రైతులు డిమాండ్ చేసారు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి, రైతుల దగ్గర మక్కలు క్వింటాలకు 2800 కి పోవాలి అని అన్నారు.
ప్రభుత్వం మక్కల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోయే సరికి ప్రవేట్ వ్యాపారులకు 1600 లకు రైతు అమ్మేసుకుంటున్నారని ప్రతి రైతుకు క్వింటాలుకు సుమారు 1000 రూపాయల చొప్పున నష్టపోతున్నారని, ఒకరైతు ఎకరాకు 30 క్వింటాలు మక్కలు పండిస్తే ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ప్రవేట్ వ్యాపారులకు అమ్మి ఎకరాలకు 30000 రూపాయలు నష్టపోతున్నాడు అని అన్నారు.
రైతులు పంటను సరైన ధరకు అమ్ముకోలేక నష్టపోతు బాధపడుతుంటే ముఖ్యమంత్రి ఎక్కడున్నారు అని మండిపడ్డారు. రైతుల బాధలు పట్టించుకోని ముఖ్యమంత్రి ఉండి ఎం లాభం అని సవాల్ చేసారు. వేములతో పాటు భీంగల్ మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
MOST READ :
-
Groups : పేదరికాన్ని జయించిన తాహేర బేగం.. గ్రూప్-1 లో ప్రతిభ, ఎంపీడీవో గా ఉద్యోగం..!
-
Croma : పండగ సీజన్ భారీ ఆఫర్స్.. ఏఏ వస్తువులకు.. ఎప్పటి వరకు అంటే..!
-
Arattai : వాట్సాప్ కు పోటీగా కొత్తగా ఇండియన్ యాప్ అరట్టై.. డౌన్ లోడ్ ఇలా, ఫీచర్స్ బలే..!
-
Bandi Sanjay : ఢిల్లీలోనే కాదు.. ఈసారి గల్లీ గల్లీలోనూ కాషాయ జెండా ఎగరేయబోతున్నాం..!









